నీట్‌ ఫలితాలు విడుదల...ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

నీట్‌ ఫలితాలు విడుదల...ఫలితాల కోసం క్లిక్‌ చేయండి
x
Highlights

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం గతనెల 5న నిర్వహించిన నీట్ (నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు బుధవారం...

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం గతనెల 5న నిర్వహించిన నీట్ (నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసి వెబ్‌సైట్‌లో పెట్టింది. నీట్ ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన ఖందేల్వాల్ 720 మార్కులకు గాను 701 మార్కులతో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇక రెండో ర్యాంకులో ఢిల్లీకి చెందిన భావిక్ బన్సాల్, మూడో ర్యాంకులో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అక్షత్ కౌశిక్ నిలిచారు. ఇద్దరూ 700 మార్కులే సాధించారు. తెలంగాణకు చెందిన మాధురీ రెడ్డి (695 మార్కులు) జాతీయ స్థాయిలో 7వ ర్యాంకుతోపాటు అమ్మాయిల్లో టాపర్‌గా నిలవడం విశేషం. అదేవిధంగా టాప్-100లో మొత్తం 20 మంది అమ్మాయిలు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మే 5న దేశవ్యాప్తంగా 154 పరీక్ష కేంద్రాల్లో నీట్‌ పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా 14,10,754 మంది పరీక్షకు హాజరయ్యారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories