అందుకే వర్మ ప్రెస్‌మీట్‌కు అనుమతించలేదు

అందుకే వర్మ ప్రెస్‌మీట్‌కు అనుమతించలేదు
x
Highlights

విజయవాడలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఏపీలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో...

విజయవాడలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఏపీలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు వెళ్లిన వర్మను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రెస్ మీట్ నిర్వహణకు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంతో నడిరోడ్డు మీద ప్రెస్‌మీట్‌ పెడతానని ప్రకటించిన వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్ర నిర్మాత రాకేశ్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు.

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యవహారంపై ఎట్టకేలకు ఏపీ పోలీసులు స్పందించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా విజయవాడలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు సెక్షన్ 144 అమలులో ఉన్నాయని, అందుకే బహిరంగ ప్రదేశాలో ఎలాంటి సమావేశాలు, సభలకు అనుమతి లేదని విజయవాడ పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై తలపెట్టిన ప్రెస్‌మీట్ కార్యక్రమానికి ఎంచుకున్న ప్రదేశం పైపుల రోడ్ నిత్యం హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలతో రద్దీగా ఉంటుందని, వర్మ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీస్తూ, శాంతి భద్రతలకు పూర్తిస్థాయిలో విఘాతం ఏర్పడి, అశాంతి చెలరేగే అవకాశ ఉందని తమకు ముందస్తు సమాచారం ఉన‍్నట్లు తెలిపారు. అత్యవసర సర్వీసులకు ఆటంకం ఏర్పడే ప్రమాదముందని అందుకే రాం గోపాల్ వర్మ ప్రెస్ మీట్‌కు అనుమతిని నిరాకరించినట్లు విజయవాడ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories