‘అర్జున్ రెడ్డి’ షూటింగ్‌లో నరకం అనుభవించా!

Submitted by arun on Tue, 05/29/2018 - 11:34
Shalini Pandey

తనకెంతో పేరు తెచ్చిపెట్టిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా వల్ల ఒకవిధంగా తనెంతో నరకయాతన అనుభవించానని ఈ మూవీ హీరోయిన్ షాలినీ పాండే తెలిపింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో నేను పడిన నరకయాతన చెప్పలేను. గతంలో నేను కాలేజీలో చదువుతున్నప్పుడు రెండు సార్లు ప్రేమలో పడి విఫలమయ్యా. 'అర్జున్ రెడ్డి' షూటింగ్ సమయంలో ప్రేమ వైఫల్యంలో ఉన్న తాను హీరోతో సన్నిహిత సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా… లవ్‌లో ఫెయిల్ అయిన నేను హీరోతో రొమాంటిక్ సీన్స్‌లో నటించాల్సి వచ్చింది. అప్పటి నా పరిస్థితి వర్ణనాతీతం..అని శాలిని ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయింది.

 ఆ సమయంలో తనకు ఇబ్బందిగా అనిపిస్తూ, నరకయాతనగా ఉండేదని, అంత బాధలోనే షూటింగ్ ను పూర్తి చేశానని చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లో అవకాశాల కోసం తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లోంచి బయటకు వచ్చానని చెప్పిన శాలిని, ముంబైలో తాను పడ్డ అద్దె ఇంటి కష్టాలనూ తెలిపింది. ముంబైలో ఒంటరిగా ఉండే వారికి ఇల్లు ఇవ్వరని, తనతో కలసి మరో అమ్మాయి, ఇంకో ఇద్దరు అబ్బాయిలు కలసి ఓ ఇంట్లో అద్దెకున్నామని, వారు తనతో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని తెలిపింది.
 

English Title
shalini pandey heart broken while shooting love scenes in arjun reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES