ఈ నులక మంచం ధర తెలిస్తే షాక్‌...

Highlights

సాధారణంగా రాత్రివేళ ఆరుబయట వెన్నెల్లో నులక మంచం మీద పడుకుని ఓ కునుకు పడితే వచ్చే సుఖమే వేరు అంటారు పెద్దలు. ఈ మంచాలు ఇప్పుడంటే కనుమరుగై పోతున్నాయి...

సాధారణంగా రాత్రివేళ ఆరుబయట వెన్నెల్లో నులక మంచం మీద పడుకుని ఓ కునుకు పడితే వచ్చే సుఖమే వేరు అంటారు పెద్దలు. ఈ మంచాలు ఇప్పుడంటే కనుమరుగై పోతున్నాయి కానీ, పాతకాలపు రోజుల్లో మాత్రం ఎక్కడ చూసినా అవే కనిపించేవి. ఉత్తరాదికి వెళ్తే రహదారులు పక్కన ఉండే దాబా(హోటల్లు) బయట మంచాల్లోనే ఆతిథ్యం ఇస్తాయి. ఇప్పుడు ఈ నాటు మంచాలకు ఆన్‌లైన్‌లో భారీ ధర పలుకుతోంది. ఒక్కో మంచం ఖరీదు దాదాపు రూ.55వేలు మాత్రమే..

ఆస్ట్రేలియాకు చెందిన డానియేల్‌ బ్లూర్‌ 2010లో భారత్‌ పర్యటనకు వచ్చాడు. అప్పుడు పంజాబ్‌లోని ఓమంచం ఆయన్ను విశేషంగా ఆకట్టుకుంది. స్నేహితుడి సహాయంతో మంచం అల్లికను నేర్చుకొన్నాడు. అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లి మంచాలను తయారు చేసి అమ్మాకానికి పెట్టాడు. ధర చూస్తే మాత్రం షాక్‌ అవ్వాల్సిందే. ఒక్కో మంచం ఖరీదు దాదాపు రూ. 55వేలు. ఇప్పుడు దీనిపై సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.

నెట్‌జన్లు తమదైన శైలిలో జోకులు పేలుస్తున్నారు. 'ఇన్నిరోజులు అనవసరంగా పక్కన పెట్టేశామే' అని ఒకరు అంటే,, 'భారత్‌కు ఆదాయం రావడానికి భారత్‌లో ఉన్న ఈ మంచాలు అన్నింటిని అమ్మేస్తే సరి', 'దీనిపై కాపీ రైట్‌ తీసుకుంటాం' అంటూ సటైర్లు పేలుస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories