దీన్ని రేప్ అన‌లేం

దీన్ని రేప్ అన‌లేం
x
Highlights

పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ప్రేమించుకున్నట్లు ఆధారాలుంటే అది అత్యాచారం కిందకు...

పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ప్రేమించుకున్నట్లు ఆధారాలుంటే అది అత్యాచారం కిందకు రాదని..ప్రేమించుకుని పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే తర్వాత రేప్ కేసు పెడితే నిందితుడిగా దోషిగా పరిగణించవద్దని బాంబే హైకోర్టు పేర్కొంది. ఓ యువకుడిపై నమోదైన అత్యాచారం కేసును తోసిపుచ్చుతూ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే..2013లో యోగేష్ తన తోటి ఉద్యోగిని ప్రేమించారు.
ఈ క్రమంలో ఓరోజు యోగేష్ తన కుటుం సభ్యులకు ఆమెను పరిచయం చేసేందుకు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవడం..ఆ రాత్రికి యువతి అక్కడే ఉండటంతో..ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పలుమార్లు అతని ఇంట్లోనే ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. కొంత కాలం తర్వాత యువతి అతన్ని పెళ్లి చేసుకోవాలని కోరింది..కానీ ఆ యువతి తక్కువ కులం కావడంతో ఇంటి పెద్దలు ఒప్పుకోవడం లేదని దాంతో యోగేష్ పాలేకర్ పై ఆమె రేప్ కేసు పెట్టింది.
పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు కాబట్టే యోగేష్‌తో శృంగారానికి ఒప్పుకున్నానని, కానీ అతను మాత్రం మాట మార్చాడని కేసు పెట్టింది. యువతి కేసు స్వీకరించిన కోర్టు యోగేష్ కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ యోగేష్.. బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
యోగేష్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సీవి భదంగ్ అతనికి అనుకూలంగా సంచలన తీర్పు ఇచ్చారు. కేసును విచారించిన బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టింది. ప్రేమతో ఒక్కటయ్యారని ఆధారాలున్నప్పుడు.. యోగేష్‌ను దోషిగా పేర్కొనడం సరికాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories