రాజస్ధాన్‌లో బీజేపీకి భారీ షాక్‌

Submitted by chandram on Wed, 11/14/2018 - 13:54
harish meena

అసెంబ్లీ ఎన్నికల వేళా వరుసగా అధికార బీజేపీకి భారీ ఎదురుదెబ్బలు తగులుతూనేఉన్నాయి. తాజాగా సంజయ్‌సింగ్‌ మసానీ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్  తీర్థంపుచ్చుకున్న విషయం తెలిసిందే కాగా వసుంధర రాజె నేృత్వంలో బీజేపీ సర్కార్ పై తీవ్రవ్యతిరేకతతో బీజేపీయేతర శక్తుల్ని ఏకాతాటిపై వచ్చి కూటమి ఏర్పాటుచేసే ప్రయాత్నాలతో బీజీపీ నేతలను కలవరపెడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ నుంచి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. దౌసా ఎంపీ, మాజీ డీజీపీ హరీశ్ మీనా బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైన అధికారంలోకి రావాలని ఆశిస్తున్న బీజేపీకి మీనా నిష్క్రమణతో ప్రశ్నర్థంగా మారింది. మీనా వర్గీయులు రాజకీయాల్లో, సర్కారుకొలువుల్లో ఉన్నారు. కాగా రాజస్ధాన్‌లో సర్కారు వ్యతిరేకతను అందిపుచ్చుకుని ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతుండగా, ఆరు నూరైనా, నూరూ ఆరైనా తిరిగి మళ్లీ బీజేపీ అధికారపగ్గాలు చేపట్టాలని చూస్తుంది. ఎలానైతేనేం హరీష్‌ మీనా రాజీనామాతో బీజేపీకి కొలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.

English Title
Setback For BJP, Lawmaker From Rajasthan Joins Congress Ahead Of Polls

MORE FROM AUTHOR

RELATED ARTICLES