సెరెనాకు భారీ జరిమాన

Submitted by arun on Mon, 09/10/2018 - 16:22
Serena Williams

అమెరికన్ బ్లాక్ థండర్, 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా విలియమ్స్ మరోసారి అనుచితంగా ప్రవర్తించి 17వేల డాలర్లు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. జపాన్ ప్లేయర్ నవోమీ ఒసాకాతో టైటిల్ కోసం పోరాడుతూ ఓటమి అంచుల్లో కూరుకుపోయిన సెరెనా తీవ్రనిరాశతో చైర్ అంపైర్ తో వాగ్వాదానికి దిగింది. రెండుసార్లు అధికారిక హెచ్చరికలు వచ్చినా క్రీడాస్ఫూర్తిని విస్మరించి అంపైర్ పై దూషణల వర్షం కురిపించింది. అదీ చాలదన్నట్లుగా టెన్నిస్ రాకెట్ ను నేలకోసి కొట్టి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.  టెన్నిస్ ఆటలో పురుషులకు ఓ న్యాయం, మహిళలకు ఓ న్యాయమా అంటూ మండిపడింది. మహిళల హక్కులు, సమానత్వం కోసం తాను పోరాడుతూనే ఉంటానంటూ చెప్పి తన తప్పును కప్పిపుచ్చుకోడానికి సెరెనా ప్రయత్నించినా ఓ పాయింటు, ఓ గేమ్ చివరకు 17వేలడాలర్ల ఫైన్ చెల్లించక తప్పలేదు. గ్రాండ్ స్లామ్ క్వీన్ సెరెనా ఫైనల్స్ ఆడుతూ అనుచితంగా ప్రవర్తించడం చైర్ అంపైర్లపై విరుచుకు పడటం ఇదే మొదటిసారి కాదు.

English Title
Serena Williams is being punished for speaking her truth

MORE FROM AUTHOR

RELATED ARTICLES