అందరినీ ఫూల్ చేద్దామనుకొని చివరికి తానే ఫూల్ అయ్యాడు...

Submitted by arun on Thu, 01/25/2018 - 19:22

వైరల్‌గా మారిన ట్రైన్ సెల్ఫీ వీడియోపై.. మరో వీడియో రిలీజ్ చేశాడు సెల్ఫీ శివ. తాను సేఫ్‌గానే ఉన్నానని ఆ వీడియోలో తెలిపాడు. తనకేం కాలేదని.. అందరినీ ఫూల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. ప్రమాదం జరిగింది.. అతనికి గాయమైంది.. నిజమేనని రైల్వే పోలీసులు తేల్చేశారు. అతని చేత ఫైన్ కూడా కట్టించారు. దీనికి సంబంధించి.. రైల్వే పోలీసులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దీంతో.. అందరినీ పూల్ చేద్దామనుకున్న సెల్ఫీ శివ.. తానే ఫూల్ అయ్యాడు.

వెనకనుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ రావడం.. రైల్వే ట్రాక్ పక్కకు నిలబడి.. శివ సెల్ఫీ దిగడం.. ట్రైన్ అతని తలకు తగలడం.. అతని గాయమవడం.. అన్నీ నిజమే. అతడు సెల్ఫీ తీసుకోవడం.. యాక్సిడెంట్ జరగడం.. అంతా నిజమే. అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో వైరల్‌గా మారిన.. ఈ ట్రైన్ సెల్ఫీ వీడియో పచ్చి నిజమని.. తేల్చారు రైల్వే పోలీసులు. ఈ ప్రమాదానికి సంబంధించి.. రైల్వే పోలీసులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడంతో.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

ఒక్క సెల్ఫీ వీడియోతో.. అందరినీ ఫూల్ చేద్దామనుకున్న శివ.. చివరికి తానే ఫూల్ అయ్యాడు. ఈ ఫూల్ అవడం సంగతి పక్కనబెడితే.. ఇలా రైల్వే ట్రాక్ పక్కకు ఎవరైనా ఫోటోలు దిగేందుకు ప్రయత్నించడం మంచిది కాదంటున్నారు రైల్వే పోలీసులు. ఎవరైనా.. రైల్వే ట్రాక్ పక్కన ఫోటోలు దిగితే.. వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. రైల్వే యాక్ట్ ప్రకారం వారికి.. 6 నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు.

Tags
English Title
Selfie With Train

MORE FROM AUTHOR

RELATED ARTICLES