సెల్ఫీ పిచ్చి...వేగంగా వస్తున్న రైలు ముందు పోజిచ్చి..
arun24 Jan 2018 9:24 AM GMT
హైదరాబాద్ భరత్‌నగర్‌లో యువకుడు దుస్సాహసం చేశాడు. రన్నింగ్‌లో ఉన్న ఎంఎంటీఎస్ ట్రైన్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. భరత్‌నగర్ రైల్వేస్టేషన్ దగ్గర జరిగిన ఈ ఘటనలో ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీకొని యువకుడు శివకి తీవ్ర గాయాలయ్యాయి. తల, చేతికి గాయాలు కావడంతో లింగంపల్లి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. మూడు రోజుల కిందట భరత్‌నగర్ రైల్వేట్రాక్‌పై ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో శివకు తలకు, చేతికి బలంగా గాయాలయ్యాయని రైల్వే ఎస్పీ అశోక్ తెలిపారు. అతనికి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ప్రస్తుతం యువతలో సెల్ఫీ పిచ్చి పీక్ స్టేజ్‌కి వెళ్లిపోతోంది. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం అత్యంత ప్రమాదకరమైనరీతిలో సెల్ఫీలు తీసుకోవడానికి యువత వెనుకాడటం లేదు.
లైవ్ టీవి
దేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMTయాత్ర డైలాగ్స్ జీవిత సత్యాలు..ముత్యాలుగా నిలిచాయి
14 Feb 2019 7:27 AM GMTచలాకి హీరొయిన్ రాధిక గారు!
12 Feb 2019 6:36 AM GMTవిజయవంతమైన ఎన్నో చిత్రాలు అందించిన విజయ బాపినీడు గారు!
12 Feb 2019 6:10 AM GMTసూత్రధారులు సిన్మాకి సూత్రధారులు
10 Feb 2019 10:05 AM GMT