అక్టోబర్‌లో కాళేశ్వరం నీళ్లు

అక్టోబర్‌లో కాళేశ్వరం నీళ్లు
x
Highlights

కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోంది. ఈ ఏడాదే కాళేశ్వరాన్ని కంప్లీట్...

కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తోంది. ఈ ఏడాదే కాళేశ్వరాన్ని కంప్లీట్ చేసి దాదాపు 40లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. రెండు వారాల వ్యవధిలో రెండోసారి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్టోబర్ నాటికి నీళ్లివ్వాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. జగిత్యాల జిల్లా రాంపూర్‌లో ఎస్సారెస్పీ పంప్ హౌస్‌ను పరిశీలించిన కేసీఆర్‌ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జులై 15లోగా మొత్తం మోటార్లు బిగించి, అక్టోబర్ నాటికి రెండు పంటలకు నీళ్లివ్వాలని, అదే సమయంలో ఎస్సారెస్పీని నింపాలని ఆదేశించారు. అనంతరం మేడిగడ్డ చేరుకుని వ్యూ-పాయింట్‌ నుంచి బ్యారేజీ పనులను పరిశీలించారు. బ్యారేజీ పనులు 90శాతం పూర్తయినట్లు అధికారులు సీఎంకి వివరించారు. దాంతో పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలంటూ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత బురద నేలలో కాలినడకన తిరుగుతూ గోదావరి జలాల్లోకి నాణేలను వదిలి గోదారమ్మకు నమస్కరించుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ బ్యారేజీని రెండు వ్యారాల వ్యవధిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించడం ఇది రెండోసారి. ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోన్న ప్రభుత్వం పనులను పరుగులు పెట్టిస్తోంది. కాళేశ్వరం పూర్తయితే 13 జిల్లాలు, 80 నియోజకవర్గాల్లో సాగు-తాగునీరు అందుబాటులోకి వచ్చి తెలంగాణ సస్యశ్యామలం కానుంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories