ప్రియా వారియర్‌‌కు సుప్రీంకోర్టులో ఊరట

Submitted by arun on Wed, 02/21/2018 - 12:02
Priya Prakash Varrier

సోషల్ మీడియా సంచలనం,  మలయాళ నటి ప్రియా వారియర్‌‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఒరు ఆదార్ లవ్‌ పాటలో నటించిన ప్రియా వారియర్‌పై దాఖలైన కేసులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రియా వారియర్‌పైనా, చిత్ర దర్శకుడిపైనా .ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మలయాళ సినిమా ఒరు ఆదార్ లవ్‌ పాటలో నటించిన ప్రియపైనా దర్శకుడిపైనా..తెలంగాణ, మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. ఓ వర్గం మనోభావాలను కించపరచేలా పాట ఉందనే ఫిర్యాదుతో పోలీసులు కేసులు పెట్టి ప్రియకు నోటీసులు జారీ చేశారు. దీంతో తనపై పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ఆపాలని ఆమె సుప్రీంను ఆశ్రయించింది.  

English Title
SC stays criminal proceedings against actress Priya Varrier

MORE FROM AUTHOR

RELATED ARTICLES