ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్లకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ డెబిట్ కార్డులు చెల్లవు

ఆన్‌లైన్‌లో రైల్వే రిజర్వేషన్లకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ డెబిట్ కార్డులు చెల్లవు
x
Highlights

న్యూఢిల్లీ: డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్ రైల్వే టికెట్ల బుకింగ్ విధానాన్ని రైల్వే శాఖ మరింత కఠినతరం చేసింది. పలు బ్యాంకులను డెబిట్ కార్డ్ పేమెంట్...

న్యూఢిల్లీ: డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్ రైల్వే టికెట్ల బుకింగ్ విధానాన్ని రైల్వే శాఖ మరింత కఠినతరం చేసింది. పలు బ్యాంకులను డెబిట్ కార్డ్ పేమెంట్ గేట్‌వే నుంచి తొలగించింది. ఇందులో ఎస్‌బీఐ, ఐసీఐసీపై బ్యాంకులు కూడా ఉండటం గమనార్హం. ఆయా బ్యాంకులు వినియోగదారుల నుంచి వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజులో వాటా ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు.

సాధారణంగా ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించినందుకు గాను ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రూ.20 మేర కన్వీనియన్స్ ఫీజు వసూలు చేసేది. అయితే, పెద్ద నోట్ల రద్దు తరవాత ఈ ఫీజు తీసుకోవటం లేదు. అయితే బ్యాంకులు వసూలు చేస్తున్న కన్వీనియన్స్ ఫీజులో తమకూ కొంత వాటా దక్కుతుందని భావించినా అవి నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories