చంద్రబాబు, రాహుల్ భేటీతో వేడెక్కిన రాజకీయ వాతావరణం

x
Highlights

దేశ చరిత్రలో ఒక సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి అడుగు పడింది. గతంలో ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్‌, టీడీపీ చేతులు కలిపాయి. 36 ఏళ్ల సైద్ధాంతిక రాజకీయ...

దేశ చరిత్రలో ఒక సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి అడుగు పడింది. గతంలో ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్‌, టీడీపీ చేతులు కలిపాయి. 36 ఏళ్ల సైద్ధాంతిక రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ...ఉమ్మడి ప్రత్యర్థి మోడీని ఎదుర్కొనడానికి రంగం సిద్ధం చేశాయి. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీలో కాంగ్రెస్‌ సారథి రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యి..దేశ రాజకీయాల్లో కొత్త పునరేకీకరణకు తెరతీశారు. గతం గురించి తమకు ముఖ్యంకాదన్న రాహుల్, చంద్రబాబు...భవిష్యత్తు గురించే ఏకమైనట్లు ప్రకటించారు. అలాగే విపక్ష నాయకులతో చంద్రబాబు జరిపిన మంతనాల ఫలితంగా.... దాదాపు 15 పార్టీలతో జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక ఫ్రంట్‌ రూపుదిద్దుకోబోతోంది. నిన్నటి ఢిల్లీ పరిణామాలతో లోక్‌సభ ఎన్నికలకు చాలా ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories