రెవెన్యూలో కొత్త చట్టాలు..

రెవెన్యూలో కొత్త చట్టాలు..
x
Highlights

రెవెన్యూ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది సర్కార్. రెవెన్యూలో కొత్త చట్టాలు తీసుకురాబోతున్నారు. ల్యాండ్ టైటిల్ చట్టాన్నిసవరించబోతున్నారు. దీనిపై...

రెవెన్యూ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది సర్కార్. రెవెన్యూలో కొత్త చట్టాలు తీసుకురాబోతున్నారు. ల్యాండ్ టైటిల్ చట్టాన్నిసవరించబోతున్నారు. దీనిపై అధ్యయనం కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు కానుంది. అవినీతి శాఖగా ముద్రపడ్డ రెవెన్యూ శాఖలో ప్రక్షాళనకు పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం. అవినీతి రహిత డిపార్ట్‌మెంట్‌గా మలిచేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ సిద్ధం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం కోసం కసరత్తు ప్రారంభించారు.కొత్త చట్టంపై కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు అధికారులతో చర్చించారు.

ఉన్న 39 చట్టాలు , ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టాలను అధ్యయనం చేసి కొత్త రెవెన్యూ చట్టాలు రూపొందించాలని భావిస్తున్నారు. సంస్కరణలపై కమిటీని నియమించాలని నిర్ణయించింది ప్రభుత్వం. సీఎస్ ఎస్.కె.జోషి ఆధ్వర్యంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

కొత్త చట్టంలో కొన్నిశాఖలను విలీనం చేయడం, పరిపాలనా, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలను రెవెన్యూ కిందికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వీటిని విలీనం చేస్తే ఒకే ముఖ్య కార్యదర్శి పరిధిలో రెండు శాఖలు పని చేస్తాయి. ఒకే ముఖ్య కార్యదర్శి ఉన్నా వేర్వేరుగా శాఖాధిపతులను నియమించనున్నారు. తెలంగాణలో భూ వివాద రహిత చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ల్యాండ్ టైటిల్ యాక్టు తీసుకు వస్తారు. ల్యాండ్ టైటిల్ యాక్టు అమలులో ఉన్న యూరప్ వంటి దేశాల్లో అధ్యయనం చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీ వేసే యోచనలో సర్కార్ ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories