చిన్నారుల చేతిలో పేలిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ

చిన్నారుల చేతిలో పేలిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ
x
Highlights

చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో పాడైపోయిన ఓ సెల్‌ఫోన్‌లోని బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కురబలకోట బీసీ కాలనీకి చెందిన...

చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో పాడైపోయిన ఓ సెల్‌ఫోన్‌లోని బ్యాటరీ పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కురబలకోట బీసీ కాలనీకి చెందిన ఇస్మాయిల్, అయేషా దంపతుల కుమారులు షేక్‌ సయ్యద్‌ , మౌలాలి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదు, మూడు తరగతులు చదువుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇంటివద్దనే ఉన్న ఈ పిల్లలు నిన్న ఇంటికి సమీపంలో దొరికిన పాత సెల్‌ఫోన్‌లో ఉన్న బ్యాటరీ బయటకు తీసి ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో బాగా ఉబ్బిపోయి ఉన్న బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో అన్నదమ్ములు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారి కేకలు విన్న స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే 108లో చిన్నారులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. మౌలాలి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నెట్టికంటయ్య తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories