ఎన్నికల చివరి దశకు చేరుకోవడంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది . ఈ నేపధ్యంలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ పై విరుచుక...
ఎన్నికల చివరి దశకు చేరుకోవడంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది . ఈ నేపధ్యంలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ పై విరుచుక పడ్డారు .. మోడీ మీ టైం ఇక అయిపోయిందని ప్రజలు మీ పైన ఉన్న విశ్వాసాన్ని కోల్పయారని అన్నారు . మోడికి ఓటమి భయం పట్టుకుందని అందుకే అయన చాలా దిగులుగా కనిపిస్తున్నారని వాఖ్యానించారు . బుధవారం మధ్యప్రదేశ్ లోని భిండ్ మరియు గ్వాలియర్ లో పర్యటించిన రాహుల్ ఈ వాఖ్యలు చేశారు..
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోడీ మరియు అయన ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సమయమొచ్చిందంటు అయన మాట్లడరు .. జరిగిన ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దానికి ఋజువు అని చెప్పుకొచ్చారు .. ప్రధాని మోడీపై ప్రజలకు నమ్మకం పోయిందని, ఆయన మరోసారి ప్రధాని అవడం అనేది పెద్ద కలే అని రాహుల్ జోస్యంచెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలోని దొంగలందరూ తమ బ్లాక్‌మనీని వైట్‌గా మార్చేసుకున్నారని ఆరోపించారు.. వీటిని ఒప్పుకోడానికి మోడికి మొఖం చెల్లదని వాఖ్యానించారు ..
మోడికి పేదలు , సామాన్యులు మరియు మహిళలతో అయన మాట్లాడారని కేవలం విదేశాలకు వెళ్లి బడా బడా పారిశ్రామిక వేత్తలను కలిసి ఆలింగనం చేసుకోవడం మాత్రమే ఆయనకి తెలుసనీ కానీ నేను అలా కాదు పెదలతోనే ఉంటానని స్పష్టం చేసారు . ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రఫెల్ ఒప్పందం విషయంలో మోడీ మరియు అనిల్ అంబానీ పేర్లు బయటకు తీసుకువస్తామని ధ్వజమెత్తారు . అధికారంలోకి రాగానే వెంటనే డిజిల్ , పెట్రోల్ , జిఎస్టి పరిదిలోకి తీసుకోని వాటి ధరలు తగ్గించే ప్రయత్నం చేస్తామని అన్నారు ..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire