టిక్ టాక్ లో ఆ వీడియోలో అప్లోడ్ కాకూడదు..

టిక్ టాక్ లో ఆ వీడియోలో అప్లోడ్ కాకూడదు..
x
Highlights

టిక్ టాక్ యాప్ పై నిషేధాన్ని ఎత్తివేసింది మద్రాస్ హైకోర్టు. గతంలో ఇచ్చిన తీర్పును సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ యాప్ పై పూర్తి విచారణ చేసి.. తుది...

టిక్ టాక్ యాప్ పై నిషేధాన్ని ఎత్తివేసింది మద్రాస్ హైకోర్టు. గతంలో ఇచ్చిన తీర్పును సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ యాప్ పై పూర్తి విచారణ చేసి.. తుది నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు నుంచి మళ్లీ మద్రాస్ హైకోర్టుకే వచ్చింది కేసు. 2019, ఏప్రిల్ 24వ తేదీన వాదనలు విన్న న్యాయస్థానం.. టిక్ టాక్ యాప్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు చెప్పింది. టిక్‌టాక్‌ అశ్లీలతను పెంపొందించడమే కాకుండా.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందంటూ మదురైకి చెందిన సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తుకుమార్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రానికి సూచించింది. ఏకపక్షంగా వ్యవహరిస్తూ మద్రాస్‌ హైకోర్టు విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ టిక్‌టాక్‌ సంస్థ సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీనిపై ఇరువాదనలు విన్న సుప్రీంకోర్టు టిక్‌టాక్‌ యాప్‌పై మాద్రాస్‌ హైకోర్టు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. దేశ భద్రత, అశ్లీల వీడియోలు యాప్ లోకి అప్ లోడ్ కాకుండా ఉండాలని సూచించింది. అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రోత్సహించం అని.. 13 ఏళ్లలోపు చిన్నారులు యాప్ వినియోగించకుండా కొత్త చర్యలు చేపడతాం అని చెప్పటంతో మద్రాస్ హైకోర్టు బ్యాన్ సడలించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories