ఒక్కొక్కడికి మూడు చెరువుల నీళ్ళు తాగించా.. మీకు తాగించలేనా..

Submitted by arun on Tue, 06/19/2018 - 16:25
babu

బిగ్‌బాస్ సీజన్ 2 ఎంతో  రసవత్తరంగా కొనసాగుతోంది. తొలి ఎలిమెనేషన్‌లో మిస్ హైదరాబాద్ సంజన చౌదరి షో నుంచి బయటకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆమె షో  నుంచి బయటకు వెళ్తూ బిగ్‌బాంబ్‌ను బాబు గోగినేనిపై వేసింది. దీంతో అతను వారం రోజులు ఇంట్లోని సభ్యుల్లో ఎవరికి మంచినీళ్లు అవసరం వచ్చినా ఆయనే తీసుకెళ్లి ఇవ్వాలి.  సంజన తనపై వేసిన బిగ్‌బాంబ్‌ను గోగినేని స్వీకరించడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ షోలోకి రాకముందు తాను అనేక టీవీ డిబేట్లలో పాల్గొన్నానని చెప్పారు. డిబేట్లలో ఒక్కొక్కరికి మూడు చెరువుల నీరు తాగించానని, అలాంటి తనకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి నీళ్లు ఇవ్వడం పెద్ద కష్టం కాదని తెలిపారు. బిగ్ బాస్ చెప్పిన రూల్స్ అన్నింటినీ కచ్చితంగా ఫాలో అవుతానని చెప్పారు. సంజన తనపై బిగ్ బాంబ్ ను ఎందుకు ప్రయోగించిందో తెలియదని... ఆమెను తాను ఎలాంటి ఇబ్బందికి గురి చేయలేదని తెలిపారు. ఆమె తనపై కోపం ఎందుకు పెంచుకుందో తెలియదని చెప్పారు. 

‘నాపై అభిమానంతో, ప్రేమతో ఇంట్లోకి కొంత మంది మిత్రులు సంజన వేసిన బిగ్‌బాంబ్ రూల్ బ్రేక్ చేసి ఎవరి నీళ్లు వారే తెచ్చుకుంటామని అంటున్నారు. కానీ రూల్స్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు. బిగ్‌బాస్ చెప్పినట్లు నేను చేస్తాను’ అని బాబు గోగినేని పేర్కొన్నాడు.

English Title
sanjana eliminated drops bigg bomb on babu gogineni

MORE FROM AUTHOR

RELATED ARTICLES