ఏలూరు అసెంబ్లీ ఫలితంపై జోరుగా ఊహాగానాలు...ఏలూరులో నెగ్గిన పార్టీకే...

ఏలూరు అసెంబ్లీ ఫలితంపై జోరుగా ఊహాగానాలు...ఏలూరులో నెగ్గిన పార్టీకే...
x
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియటంతోనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ ఫలితం పై ఊహాగానాలు జోరందుకొన్నాయి. ఈవీఎంలు మోరాయించడం, నిప్పులు చెరిగే...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియటంతోనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ ఫలితం పై ఊహాగానాలు జోరందుకొన్నాయి. ఈవీఎంలు మోరాయించడం, నిప్పులు చెరిగే ఎండవేడిమి వంటి కారణాలతో పోలింగ్ శాతం సాధారణం కంటే తక్కువగా నమోదు కావడం పార్టీల గుండెల్లో గుబులు రేపుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ స్థానం అనగానే రాజకీయ నేతలకు ఓ సెంటిమెంట్ గుర్తుకు వస్తుంది. ఏలూరు లో ఏపార్టీ అభ్యర్థి నెగ్గితే అదే పార్టీ అధికారం చేపట్టడం గత కొద్ది ఎన్నికలుగా ఓ ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఎన్నికలకు ముందు వరకూ జరిగిన మొత్తం 13 ఎన్నికల ఫలితాలు చూసినా ఏలూరు అసెంబ్లీలో విజేతగా నిలిచిన పార్టీనే అందలాన్ని అందుకోడం కనిపిస్తుంది.

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 38వేల807 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1లక్షా 24వేల 814మంది, పురుషులు 1లక్షా 13వేల 955 మంది ఉన్నారు. అయితే ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో జిల్లా వ్యాప్తంగా మరెక్కడ లేనంతగా ఏలూరులోనే అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైయ్యింది. కేవలం 67.59శాతం అంటే లక్షా 61వేల 414 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పురుషుల కంటే మహిళా ఓటర్లే 5వేల మంది అదనంగా తమ ఓటు హక్కు వినియోగించుకోగలిగారు. పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఈవీఎంలు మొరాయించడం, అదీ చాలదన్నట్లు ఆ తరువాత ఎండ వేడిమి పెరిగిపోడంతో పోలింగ్ బూత్ కు వెళ్లేందుకు ఓటర్లు వెనకడుగు వేయండం ఏలూరులో తక్కువ పోలింగ్ శాతం నమోదవ్వడానికి కారణాలుగా చెబుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుండి ఏలూరును ఏలేవారే రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటి వరకూ ఏలూరు అసెంబ్లీకి 13సార్లు ఎన్నికలు జరిగితే 6సార్లు కాంగ్రెస్ అభ్యర్ది, 4సార్లు టీడీపీ అభ్యర్ది, 2 సార్లు ఇండిపెండెంట్, 1సారి సిపిఐ అభ్యర్ది విజయం సాధించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 70వేలకు పైగా కాపు సామాజికవర్గం ఓటర్లుండగా 90వేలకు పైగా బీసి సామాజిక వర్గాల ఓటర్లున్నారు. ఆ తరువాత ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓటర్లతో పాటు ఆర్యవైశ్యుల ఓట్లు సైతం జయాపజయాలలో నిర్ణయాత్మకం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories