నెగ్గేదెవరు? నేడు ముంబై-చెన్నై మొదటి ప్లే ఆఫ్ మ్యాచ్

నెగ్గేదెవరు? నేడు ముంబై-చెన్నై మొదటి ప్లే ఆఫ్ మ్యాచ్
x
Highlights

ఇన్ని రోజులు జరిగిందంతా ఒకేత్తు ఇప్పుడు జరగబోయేది ఒకేత్తు.. అదే ఐపిఎల్ మొదటి ప్లే ఆఫ్ మ్యాచ్.. నేడు చెన్నై మరియు ముంబై మధ్య మొదటి ప్లే ఆఫ్ మ్యాచ్...

ఇన్ని రోజులు జరిగిందంతా ఒకేత్తు ఇప్పుడు జరగబోయేది ఒకేత్తు.. అదే ఐపిఎల్ మొదటి ప్లే ఆఫ్ మ్యాచ్.. నేడు చెన్నై మరియు ముంబై మధ్య మొదటి ప్లే ఆఫ్ మ్యాచ్ జరగనుంది.. ఈ మ్యాచ్ తో ఫైనల్ లో ఉండే జట్టేదో తెలిసిపోతుంది.. డిఫెండింగ్ ఛాంపియన్ గా చెన్నై బరిలోకి దిగుతుంటే లీగ్ దశను సక్సెస్ గా ముగించిన ముంబై అదే జోరును కనబరిచి ఫైనల్ లోకి ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టాలని చూస్తుంది..

ఒక్కసారి ఇరు జట్ల బలాబలాలు చూసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఇరు జట్లు మంచి పోటీని కనబరిచాయి.. చెన్నై జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్న టీం మొత్తానికి కెప్టెన్ ధోని మోస్ట్ ఎసెర్ట్.. ఇటు కెప్టెన్ గా అటు బ్యాట్సమెన్ గా ఈ సీజన్ లో ధోని ఇరకొట్టాడు.. చెన్నై గెలిచిన ప్రతి మ్యాచ్లో ధోనిదే కీ రోల్. ధోనీకి తోడు ఓపెనర్ వాట్సాన్, రైనా ,డుప్లెసిస్‌ తమ వంతు చేయిస్తే చెన్నై గెలుపు నల్లేరుపై నడకలాగే సాగుతుంది.. మిడిల్ ఆర్డర్ లో కేదార్ జాదవ్ గాయం కారణంగా అతడి స్థానంలో ధ్రువ్‌ షోరే జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..

ఇక బౌలింగ్ విషయానికి వస్తే చెన్నై కి స్పిన్నర్స్ ప్రధాన బలం. అందులో అద్భుత ఫామ్‌లో ఉన్న స్పిన్నర్‌ తాహిర్‌పై చెన్నైకి భారీ ఆశలే పెట్టుకుంది.. అతడికి తోడు జేడేజా, హార్బజన్ మ్యాజిక్ చేస్తే ముంబై ని భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయుచ్చు.ఇక పేసర్‌ దీపర్‌ చాహర్‌ మరోసారి విజృభిస్తే సూపర్‌కింగ్స్‌ ఫైనల్ కి సునాయాసంగా చెరొచ్చు..

ఇక ముంబై విషయానికి వచ్చేసరికి టోర్నీ మొదట్లో కాస్తా తడబడ్డ చివరి మ్యాచ్లు వరుసగా గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి ప్లేస్ కొట్టేసింది.. అదే ఉత్సాహంతో ప్లే ఆఫ్ బరిలోకి దిగుతుంది.. ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, హార్దిక్ పాండ్య, పొలార్డ్‌లతో ముంబై బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది... ఇందులో ముఖ్యంగా హార్దిక పాండ్యా ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లో మంచి ఫార్మ్ కొనసాగిస్తూ ఉండడం ముంబైకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి..

ఇక బౌలింగ్ విషయానికి వచ్చేసరికి బుమ్రా, మలింగా, పాండ్య బ్రదర్స్ , రాహుల్‌ చాహర్‌లతో కూడిన పదునైన బౌలింగ్‌ ముంబై జట్టు ఎలాగూ ఉంది.. ఇన్ని ఉన్నా చెన్నై తో మ్యాచ్ అంటే ముంబైకి అంతా ఈజీ కాదనే చెప్పాలి.. ఇందులో ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.. ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగే ఎలిమినేటర్‌లోని విజేతతో శుక్రవారం క్వాలిఫయర్‌-2 లో తలపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories