రికార్డుల మోత మోగిస్తున్న హాలీవుడ్ సినిమా

రికార్డుల మోత మోగిస్తున్న హాలీవుడ్ సినిమా
x
Highlights

గత సంవత్సర కాలంగా మార్వెల్ సినిమా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'అవెంజర్స్ అండ్ గేమ్'. 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' సినిమాకి సీక్వెల్...

గత సంవత్సర కాలంగా మార్వెల్ సినిమా అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'అవెంజర్స్ అండ్ గేమ్'. 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' సినిమాకి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అనుకున్న విధంగానే ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ ను అందుకుంటూ ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు సైతం బద్దలు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ డాలర్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎనిమిది వేల 400 కోట్ల రూపాయలను మాట.

కేవలం మొదటి మూడు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తాన్ని వసూలు చేసి 'అవెంజర్స్ అండ్ గేమ్' సినిమా అందరిని షాక్ కి గురి చేస్తోంది. అమెరికాలో సైతం అదే జోరును కనబరుస్తున్న 'అవెంజర్స్ అండ్ గేమ్' సినిమా 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' సినిమా కంటే ఎక్కువగా వసూళ్లు సాధిస్తోంది. మొదటి వారాంతంలో 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' సినిమా 257 మిలియన్ డాలర్లను నమోదు చేసుకోగా 'అవెంజర్స్ అండ్ గేమ్' సినిమా ఏకంగా 350 మిలియన్ డాలర్స్ ను నమోదు చేసుకుంది. ప్రివ్యూ లతోనే రికార్డుల ఖాతా తెరిచిన ఈ చిత్రం హయ్యస్ట్ ఓపెనింగ్స్ మరియు వీకెండ్ కలెక్షన్స్ తో కూడా రికార్డుల మోత మోగిస్తోంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా విజయఢంకా మోగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories