వైసీపీలో చేరిన ఇందూధర్‌రెడ్డి

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 13:49
sangam ex zptc member indhudharreddy joined in ycp

ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది రాజకీయ నాయకులు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వలసలు ఊపందుకున్నాయి. అందులో  ముఖ్యంగా వైసీపీలోకి ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. నిన్న(ఆదివారం) మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అలాగే మరో నేత కూడా టీడీపీకి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా సంగం జడ్పీటీసీ సభ్యుడు తుంగా ఇందూధర్‌రెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఈ కార్యక్రమంలో నీటి సంఘం మాజీ అధ్యక్షుడు తుంగా దయాకర్ రెడ్డి, మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. 

English Title
sangam ex zptc member indhudharreddy joined in ycp

MORE FROM AUTHOR

RELATED ARTICLES