కాళేశ్వరగంగ.. ఉరకంగ.. కాళేశ్వరం ఎత్తిపోతల పరీక్ష సక్సెస్

కాళేశ్వరగంగ.. ఉరకంగ.. కాళేశ్వరం ఎత్తిపోతల పరీక్ష సక్సెస్
x
Highlights

కాళేశ్వరం తెలంగాణను సస్యశ్యామలం చేసే మహాయజ్ఞం. గోదావరి నీటిని ఒడిసి పట్టి రాష్ట్రాన్ని హరితమయంగా చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగా...

కాళేశ్వరం తెలంగాణను సస్యశ్యామలం చేసే మహాయజ్ఞం. గోదావరి నీటిని ఒడిసి పట్టి రాష్ట్రాన్ని హరితమయంగా చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగా సాగుతున్న గొప్పకలల ప్రాజెక్టు. అహోరాత్రులు ఇంజినీర్లు వేలమంది కార్మికులు అకుంటిత దీక్షతో రూపుదిద్దుకుంటున్న నీటి కల్పతరవు.లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే ఈ సంకల్పంలో మొదలు పెట్టిన ప్రాజెక్టు మరో అడుగుకు ముందుకేసింది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వెట్ రన్ కోసం ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ఆరో ప్యాకేజ్ సొరంగంలోకి ఇంజనీర్లు, అధికారులు నీటిని విడుదల చేశారు. గ్రావిటీ కెనాల్ లోకి నీటిని విడుదల చేశారు. పాలకుర్తి మండలం వేమునూరులోని రెగ్యులేటర్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అధికారులు పూర్ణకుంభంతో గేట్లపైకి చేరుకున్నారు. ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు మీట నొక్కి ఒక గేటు ద్వారా నీటిని కాలువలోకి వదిలారు.

ఎల్లంపల్లి నుంచి 11 కిలోమీటర్ల పొడవునా గ్రావిటీ కెనాల్ ద్వారా ఎనిమిది కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నందిమేడారం పంప్ హౌస్ లోని సర్జ్ పూల్ కు ఈ నీటిని విడుదల చేశారు. నాలుగైదు రోజుల్లో సర్జ్ పూల్ కు నీరు చేరనుంది. నందిమేడారం పంప్ హౌజ్ లో 124.4 మెగావాట్ల సామర్థ్యం గల భారీ మోటార్లను వినియోగించారు. ఈ మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే వెట్ రన్ చేపట్టనున్నారు. కొత్త నిర్మాణాలు కావడంతో అన్నింటినీ సునిశితంగా పరిశీలిస్తూ, నీటి విడుదలను పెంచుతామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకు వీలుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కొన్ని బ్యారేజ్ లు, పంపు హౌస్ లు, కాలువలు, సొరంగాల సమాహారంతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి అంకం విజయవంతమైంది.





Show Full Article
Print Article
Next Story
More Stories