రైతులకు శుభవార్త .. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు ..

రైతులకు శుభవార్త .. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు ..
x
Highlights

రైతులకు ఇది శుభవార్తేనని చెప్పాలి. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది .. నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల జూన్-సెప్టెంబరు...

రైతులకు ఇది శుభవార్తేనని చెప్పాలి. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది .. నైరుతి ఋతుపవనాల ప్రభావం వల్ల జూన్-సెప్టెంబరు మధ్య సగటు వర్షపాతంలో 96 శాతం నమోదవుతుందంటూ చెప్పుకొచ్చింది .. ఏప్రిల్ 15న ఇచ్చిన తొలి అంచనా నివేదికలో మరింత సమాచారం జోడించిన వాతావరణ శాఖ శుక్రవారం రెండో దశ నివేదికను విడుదల చేసింది. చివరి రెండు నెలలకు సంబంధించిన తుది నివేదికను జూలై చివరిలో ఇవ్వనున్నట్టు తెలిపింది. దీంతో ఖరీఫ్‌కు ఎంతో కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా 95 శాతం, 99 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories