వినికిడి లోపం ఉన్న పిల్ల‌ల‌కి స‌మంత చేయూత‌

Submitted by arun on Sat, 07/14/2018 - 12:17
sam

సమంత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే సమాజ సేవ కూడా చేస్తున్నారు. ప్రత్యూష ఫౌండేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఎందరికో చేయూతను అందిస్తున్నారు. ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను ఆదుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రముఖ ఆస్పత్రులతో కలిసి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారుకుల ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడే మహిళలు, చిన్నారులకు వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా ఫోనాక్ అనే సంస్థ ద్వారా వినికిడి లోపంతో బాధ‌ప‌డుతున్న ప‌ది మంది చిన్నారుల‌కి వినికిడి యంత్రాలు అందించారు. ఈ సంస్థ వినికిడి లోపంతో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌ని గుర్తించి ఉచిత శిబిరాలు నిర్వ‌హిస్తోంది. భవిష్య‌త్‌లో సంస్థ‌కి కావ‌ల‌సిన సాయం తాను అందిస్తానంటూ స‌మంత పేర్కొంది.

English Title
samantha helps to poor people

MORE FROM AUTHOR

RELATED ARTICLES