విపక్షాలపై నిప్పులు చెరిగిన ప్రధాని

విపక్షాలపై నిప్పులు చెరిగిన  ప్రధాని
x
Highlights

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విపక్షాల నిప్పులు చెరిగారు. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికులను అవమానపరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు...

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విపక్షాల నిప్పులు చెరిగారు. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికులను అవమానపరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం 40 ఏళ్లుగా అన్యం పుణ్యం ఎరుగని అమాయకులను బలిపెడుతున్నారంటూ విమర్శించారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తులు పాతాళం దాక్కున్నా వదలబోనంటూ హెచ్చరించారు.

గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విపక్షాలు టార్గెట్‌గా మాటల తూటాలు వదిలారు. దేశ భద్రత, ప్రజల హితం కోసం ఎలాంటి నిర్ణయమైన తీసుకోవడానికి తాము సిద్ధమని ప్రకటించారు. గతంలో పాలించిన ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం వల్లే బయటి దేశాల నుంచి భారత్‌పై దాడులు జరిగాయన్నారు . దేశ సమగ్రతను దెబ్బతీయాలని చూసిన ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి చేస్తే కొందరు విపక్ష నేతలు దిగజారి విమర్శలు చేస్తున్నారంటూ ప్రధాని ఆరోపించారు. దేశ హితం కోసం చేసే పని ఇదేనా ? అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో ఉగ్రవాదాన్ని వెతికి వెతికి అంతచేయడమే తన లక్ష్యమన్నారు.

తామ ప్రభుత్వం చేపట్టిన పథకాలపై విమర్శలు గుప్పించినా తాను బాధపడబోనన్నారు. రాజకీయ విమర్శలను పక్కన బెట్టి దేశ భద్రతను పణంగా పెట్టి నేతలు ప్రవర్తిస్తున్న తీరు పాకిస్ధాన్‌కు అనుకూలంగా మారుతోందని ప్రధాని మండిపడ్డారు. వైమానిక ఎన్నికల స్టంట్ అన్న విపక్షాలకు ప్రధాని ధీటుగా కౌంటర్ ఇచ్చారు. తొలి సారి దాడులు చేసినప్పుడు ఎన్నికలున్నాయా ? అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. సర్జికల్ స్రయిక్స్‌ విజయవంతంగా పూర్తయితే సైన్యం గురించి మాట్లాడకూడదని చెప్పడం దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.

సైనికుల త్యాగాలను స్మరిస్తూ విపక్షాలపై ప్రధాని విమర్శలు చేయడంపై రాజకీయ విశ్లేషకులు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. గత పాలకుల వైఫల్యాలను గుర్తు చేయడంతో పాటు మోడీ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయాలను తెరపైకి తెచ్చేందుకు ఈ ప్రయత్నాలు చేసినట్టు భావిస్తున్నారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందనే వార్తల నేపధ్యంలో ప్రధాని కామెంట్స్‌ రాజకీయాల్లో హాట్‌హాట్‌గా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories