సల్మాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ల నుంచి ముప్పు...హత్య చేసేందుకు పక్కా ప్లాన్

సల్మాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ల నుంచి ముప్పు...హత్య చేసేందుకు పక్కా ప్లాన్
x
Highlights

కృష‌్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై బిష్టోయ్ తెగ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోందా ? ఇందుకోసం సల్మాన్ ఖాన్ హత్యకు ...

కృష‌్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై బిష్టోయ్ తెగ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోందా ? ఇందుకోసం సల్మాన్ ఖాన్ హత్యకు గ్యాంగ్‌ స్టర్‌లు యత్నిస్తున్నారా ? పోలీసుల కన్నుగప్పేందుకు హైదరాబాద్ నుంచి ప్లాన్ అమలు చేశారా ? గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారా ? అంటే అవుననే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్‌ను సంపత్ నెహ్రూను వలపన్ని పట్టుకున్న పోలీసులు .. విచారణలో ఈ విషయాలను నిర్ధారించారు.
గ్రాఫిక్స్ ఆన్ వాయిస్ విత్ బ్రేకింగ్ మ్యూజిక్

హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్ స్టర్ సంపత్ నెహ్రా ను ఇటీవల సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన సంపత్ పేరు చెప్తే చాలు ఈ మూడు రాష్ట్రాల ప్రజలు బెంబేలెత్తిపోతారు. కరడుగట్టిన మరో నేరస్థుడు లారెస్స్ బిష్టోయ్ ప్రధాన అనుచరుడిగా ఉన్న సంపత్ దాదాపు 12 సంచలన హత్యకేసుల్లో నిందితుడు. ఇతడిని పట్టుకోవటానికి మూడు రాష్ట్రాల పోలీసులు కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

లండన్‌లో ఉండే తన బాస్ సోదరుని ద్వారా హైదరాబాద్ మియాపూర్ లో ఉండే కొంతమంది యువకులను సంప్రదించి వాళ్ల గదిలోనే ఆశ్రయంపొందాడు. తన గత చరిత్ర తెలియకుండా జాగ్రత్తపడిన సంపత్ ఉద్యోగ ప్రయత్నం కోసమే వచ్చినట్లు వాళ్లను నమ్మించాడు. బయటతిరిగే సమయంలో నకిలీ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ వాడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు. ఫోన్లు వాడితే దొరికిపోతామని భావించిన సంపత్ నెహ్రూ ... అవసరమైనప్పుడు మాత్రమే ఇతర ప్రదేశాల్లో వినియోగిస్తున్న సిమ్‌ కార్డుకు సంబంధించిన వాట్సప్ ద్వారా చాటింగ్ నిర్వహించే వాడు. గతంలో సల్మాన్‌ ఖాన్‌ను బెదిరించడంతో పోలీసులు బిష్టోయ్ ఫోన్లపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో వాట్సప్ చాటింగ్ గుర్తించిన హర్యానా పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. లోతుగా విచారణ జరిపిన పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఓ వ్యక్తిని గుర్తించి సీసీ పుటేజీల ద్వారా ఫోటోలు తీసి హర్యానా పోలీసులకు పంపారు. సంపత్ నెహ్రూగా నిర్ధారించిన అనంతరం మూడు రోజుల పాటు మియాపూర్‌లో మకాం వేసి సంపత్ నెహ్రూను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ సమయంలో సంపత్ నెహ్రూ వినియోగించిన ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి ఫోటోలతో పాటు చుట్టుపక్కల ఉండే రోడ్డు, సీసీ కెమెరాల వివరాలు, భద్రతకు సంబంధించిన ఫోటోలను గుర్తించిన పోలీసులు లోతుగా విచారణ జరిపారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సల్మాన్‌ఖాన్‌ను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించి ఫోటోలు తీసినట్టు సంపత్ నెహ్రూ పోలీసులకు వెల్లడించారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌ను హత్య చేస్తామని బిష్ణోయ్‌ వర్గం ఇది ప్రకటించిన నేపధ్యంలో ఈ రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. మరింత లోతైన దర్యాప్తు కోసం సంపత్ నెహ్రూను హర్యానా పోలసులకు అప్పగించిన ఉన్నతాధికారులు కేసు విచారణను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories