ఒత్తిడి నుండి ఉపశమనం పొందండి ఇలా ..

ఒత్తిడి నుండి ఉపశమనం పొందండి ఇలా ..
x
Highlights

మనలో చాలా మందికి పని ఒత్తడి కారణంగా తలనొప్పి వస్తుంది. అది సహజమే కూడా .. అలాంటిది వేసవిలో ఎండ వేడిమికి బయటికి వెళ్తే తలనొప్పితో పాటు వడదెబ్బ...

మనలో చాలా మందికి పని ఒత్తడి కారణంగా తలనొప్పి వస్తుంది. అది సహజమే కూడా .. అలాంటిది వేసవిలో ఎండ వేడిమికి బయటికి వెళ్తే తలనొప్పితో పాటు వడదెబ్బ తగులుతుంది. ఈ తలనొప్పి నుండి తప్పించుకోవడానికి చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే తలనొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు. ..

* ఎండలో తిరగడం వల్ల తలనొప్పి వస్తే..వెంటనే కాసేపు నీడలో సేద తీరాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీని వల్ల మనస్సుకు ప్రశాంతత కలిగి..తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

* ఎండలో తిరగాల్సి వస్తే తలపై టోపీ కానీ, టవల్ కానీ కప్పుకోవాలి. వీటి వల్ల ఎండ నేరుగా మన తలకు తగలకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది.

* రోజుకు తగినంత నీరు తాగకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి రోజు తగిన మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు.

* అరటిపండ్లు, పైనాపిల్, పుచ్చకాయలను తినడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

* చల్లని కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఇతర సహజసిద్ధ పానీయాలను తాగితే తలనొప్పి రాకుండా ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories