వైఎస్సార్ బాటలో జగన్..కేబినెట్‌లో వాళ్లకే ప్రాధాన్యత!

వైఎస్సార్ బాటలో జగన్..కేబినెట్‌లో వాళ్లకే ప్రాధాన్యత!
x
Highlights

ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శకం ఎంతో ముఖ్యమైనది. రాజశేఖర్ రెడ్డి హయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 108 104 సేవలు...

ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్రలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శకం ఎంతో ముఖ్యమైనది. రాజశేఖర్ రెడ్డి హయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 108 104 సేవలు ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ సహా ఎన్నో కొత్త పథకాలు ప్రారంభమయ్యాయి. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేయటంతో పాటే జలయజ్ఞం సహా పలు కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటివి రాజశేఖర్ రెడ్డిని రెండోసారి ఎన్నికల్లో గెలిచేలా చేశాయి. ఇప్పుడు ఇదే తరహా పాలన అందించాలన్న లక్ష్యంతో వైఎస్ తనయుడు వైఎస్ జగన్ ఎన్నికల బరిలో నిలిచారు. ఏపీ ఫలితాలు గురువారం వెలువడనున్నాయి.

ఈనేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నరాలే తెగే ఉత్కంఠ నెలకొంది. ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడే మళ్లీ గెలుస్తారా? లేదంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా? అని ఆంధ్ర ప్రజలు తీవ్ర ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం జగన్‌కే జైకొట్టాగా ఆంధ్రా ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం నారా చంద్రబాబుకు జైకొట్టింది. గెలుపుపై ఎవరికి వారు ధీమావ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఇటు టీడీపీ, అటు వైసీపీ ఢంకా బజాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఓ వార్త ప్రస్తుతం తెగ హల్ చల్ చేస్తోంది. ఏపీలో విజయం ఖాయం అని తెలిసిన వైసీపీ ముఖ్యనేతలు అప్సుడే జగన్‌ను కలిసి మంత్రి పదవుల కోసం సంప్రదింపులు చేస్తున్నారట. వారిలో ముఖ్యంగా గతంలో వైఎస్ కేబినెట్‌లో పని చేసిన ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ పార్ధసారధి మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు మంత్రి పదవుల ఇప్పటి నుండే లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ అధినేత కూడా తన తండ్రితో పాటు పని చేసిన వారు కావడంతో వీరికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లే తెలుస్తోంది. ఇక పార్టీలో సినీయర్ లీడర్లకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వలని జగన్ డిసైడ్ అయినట్లు గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories