సోలో ఫైట్...తెలుగుదేశం 36 ఏళ్ల చరిత్రలో...

సోలో ఫైట్...తెలుగుదేశం 36 ఏళ్ల చరిత్రలో...
x
Highlights

గత మూడున్నర దశాబ్దాలకాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని సమూలంగా మార్చివేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుత 2019 ఎన్నికల్లో జీవన్మరణ పోరాటానికి...

గత మూడున్నర దశాబ్దాలకాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని సమూలంగా మార్చివేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుత 2019 ఎన్నికల్లో జీవన్మరణ పోరాటానికి సిద్ధమయ్యింది. ఏపార్టీతోనూ పొత్తు లేకుండా తొలిసారిగా ఒంటరిపోరాటానికి దిగుతోంది.

తెలుగుదేశం...ఓ సినీ దిగ్గజం నెలకొల్పిన పార్టీ. తెలుగుదేశం గత 36 ఏళ్లుగా తెలుగురాష్ట్రాల రాజకీయాలను సమూలంగా మార్చిన పార్టీ. 1983 నుంచి 2014 ఎన్నికల వరకూ ఏదో ఒకపార్టీతో పొత్తు పెట్టుకొని ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చిన పార్టీ టీడీపీ మాత్రమే. అయితే ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఏపార్టీతోనూ పొత్తు లేకుండా సోలోగానే బరిలోకి దిగుతోంది. గత 36 ఏళ్ల కాలంలో టీడీపీ ఎన్నికల బరిలో ఒంటరిగా నిలవడం ఇదే మొదటిసారి.

గత మూడున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే బీజెపీ లేదా వామపక్షాలతో కలసి పోటీ చేయటమే ఎక్కువగా కనిపిస్తుంది. టీడీపీ ఆవిర్భవించిన 1983 సంవత్సరంలోనే మేనకా గాంధీకి చెందిన సంజయ్ విచార్ మంచ్ పార్టీతో కలసి పోటీ చేసింది.

1983 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడమే కాదు తొలిప్రయత్నంలోనే అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది. 1984 ఎన్నికల్లో మాత్రం బీజెపీతో కలసి టీడీపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకొంది. దేశమంతా వ్యతిరేకపవనాలు వీచినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టీడీపీ కూటమి విజయం సాధించడమే కాదు లోక్ సభలో ప్రధానప్రతిపక్షంగా వ్యవహరించింది. 1989 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అదే కూటమితో ఎనికలబరిలో దిగి ఘోరపరాజయం ఎదుర్కొంది.

1994 ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలసి పోటీ చేసిన టీడీపీ విజయం సొంతం చేసుకొంది. టీడీపీతో కలసి పోటీ చేయడం ద్వారా వామపక్ష పార్టీలు బాగా లబ్ది పొందాయి. 1995 ఎన్నికల సమయంలో టీడీపీ రెండుగా చీలి ఎన్నికల బరిలోకి దిగింది. ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1996 ఎన్నికల్లో వామపక్షాలతో కలసి పోటీ చేసిన టీడీపీ 1998లో లోక్ సభకు మధ్యంతర ఎన్నికల్లోనూ వామపక్షాలతోనే పొత్తును కొనసాగించింది.

1999లో బీజెపీతో కలసి పోటీ చేసిన టీడీపీ అధికారం సాధించింది. చంద్రబాబు రెండోసారి సీఎం పదవిని చేజిక్కించుకొన్నారు. 2004 ఎన్నికల్లో బీజెపీ-టీడీపీ కూటమి ఘోరపరాజయం చవిచూడక తప్పలేదు. ఆ తర్వాత బీజెపీకి టీడీపీ గుడ్ బై చెప్పింది. 2009 ఎన్నికల్లో మిగిలిన పక్షాలతో కలసి టీడీపీ కూటమి కట్టినా పరాజయం తప్పలేదు.

ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో బీజెపీతో కలసి మరోసారి ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అధికారం అందుకొంది. టీడీపీతో జత కట్టడం ద్వారా బీజెపీ సైతం స్థాయికి మించి సీట్లు గెలుచుకోగలిగింది. ఏపార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న టీడీపీ ప్రతిపక్ష వైసీపీ దూకుడును ఏస్థాయిలో అడ్డుకోగలదన్నదే ఇక్కడి అసలుపాయింటు.

Show Full Article
Print Article
Next Story
More Stories