అమ్మ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి

అమ్మ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి
x
Highlights

'ఫిదా' చిత్రంలో తెలంగాణ పోరి భానుమతిగా ఆక‌ట్టుకుంది సాయిప‌ల్ల‌వి. నిజంగానే తెలంగాణ అమ్మాయేమో అనిపించింది ఆ సినిమాలో. అంతేకాదు.. త‌న‌కు ఇదే తొలి తెలుగు...

'ఫిదా' చిత్రంలో తెలంగాణ పోరి భానుమతిగా ఆక‌ట్టుకుంది సాయిప‌ల్ల‌వి. నిజంగానే తెలంగాణ అమ్మాయేమో అనిపించింది ఆ సినిమాలో. అంతేకాదు.. త‌న‌కు ఇదే తొలి తెలుగు సినిమా అయినా, తెలుగు రాకున్నా డ‌బ్బింగ్ చెప్పుకుందీ కేర‌ళ‌కుట్టి. ప‌ర‌భాషా ముద్దుగుమ్మ‌లు డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డమే గొప్ప అయితే.. క్లిష్ట‌మైన తెలంగాణ స్లాంగ్‌లో డ‌బ్బింగ్ చెప్ప‌డం అన్న క్రెడిట్ సాయిప‌ల్ల‌వికే ద‌క్కింది.

మ‌ల‌యాళంలో తానే డ‌బ్బింగ్ చెప్పుకునే సాయిపల్ల‌వి.. తొలిసారిగా న‌టించిన‌ త‌మిళ చిత్రంలోనూ డ‌బ్బింగ్ చెప్పింద‌ట‌.
తెలుగులో 'క‌ణం', త‌మిళంలో 'క‌రు' పేరుతో తెర‌కెక్కిన‌ ఈ ద్విభాషా చిత్రంలో నాగ‌శౌర్య క‌థానాయ‌కుడు కాగా, ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నాలుగేళ్ల చిన్నారికి అమ్మ‌గా సాయిపల్ల‌వి న‌టించ‌డం విశేషం. ఎబార్ష‌న్ అనే అంశం చుట్టూ తిరిగే క‌థ‌తో ఈ సినిమా రూపొందింది. వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుందీ చిత్రం.

Show Full Article
Print Article
Next Story
More Stories