సొంత పార్టీ నేతలతో జగన్‌కు తలనొప్పులు...తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతోన్న...

Submitted by arun on Thu, 07/05/2018 - 10:54

ప్రజాసంకల్ప యాత్రలో రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరిలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్‌కు నేతల కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. 2019లో అధికారం దక్కాలంటే తూర్పులో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనుకుంటోన్న జగన్‌‌‌కు ఇంటి పోరు ఇబ్బంది పెడుతోంది. ఎవర్నీ వదులుకోవడానికి సిద్ధంగాలేని జగన్‌‌ ఏదో ఒక పదవిచ్చి శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 2014లో ఉభయగోదావరి జిల్లాలు కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు అధికారానికి అడుగు దూరంలో వైసీపీ ఆగిపోవడానికి ముఖ్య కారణం ఈ రెండు జిల్లాలే పశ్చిమలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన జగన్ పార్టీ తూర్పులో మాత్రం గుడ్డిలో మెల్లలా  19కి 5 చోట్ల గెలిచి పరువు నిలబెట్టుకుంది. ఈ ఐదుగురిలో ముగ్గురు టీడీపీలోకి జంప్‌ చేయడంతో ఆ సంఖ్య రెండుకి పడిపోయింది. అయితే 2019లో ఉభయగోదావరి జిల్లాల్లో ఫ్యాన్‌ గాలి బలంగా వీచేలా జగన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తూర్పులో కనీసం 10 స్థానాలనైనా దక్కించుకోవాలని చూస్తోంది. అందుకే దళిత, కాపు ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల మీదుగా జగన్ పాదయాత్ర సాగుతోంది. అయితే అసలు కథ రామచంద్రాపురం నియోజకవర్గంలోకి ఎంటరవగానే మొదలైంది. ఈసారి తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ పట్టుబడతుండటం వైసీపీ అధినేతను ఇరకాటంలో పడేసింది. అయితే పార్టీ అంతర్గత సర్వేల్లో మాజీ జెడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాల్‌కే ప్రజాదరణ ఉందని తేలడంతో జగన్‌ ఆయన వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ముమ్మడివరం టికెట్‌ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

తూర్పుగోదావరిలో నేతల మధ్య విభేదాలు వైసీపీ అధినేతకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఎవర్నీ వదులుకోవడం ఇష్టంలేని జగన్‌ ఏదో ఒక పదవిచ్చి శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ, వైసీపీల్లోని అసంతృప్త నేతలు జనసేనాని పవన్‌ వైపు చూస్తుండటంతో రెండు పార్టీల్లోనూ ఆందోళన మొదలైంది.

English Title
S Jagan Tense Over 2019 Elections In East & West Godavari

MORE FROM AUTHOR

RELATED ARTICLES