అందుకే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నా: బండ్ల గణేశ్

అందుకే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటున్నా: బండ్ల గణేశ్
x
Highlights

"బండ్ల గణేశ్" ఈ పేరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మారుమోగింది. సోషల్ మీడియా. ఛానల్స్, ఎక్కడ చూసిన అప్సుడు బండ్ల గణేశ్ పేరే వినిపించిన విషయం...

"బండ్ల గణేశ్" ఈ పేరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మారుమోగింది. సోషల్ మీడియా. ఛానల్స్, ఎక్కడ చూసిన అప్సుడు బండ్ల గణేశ్ పేరే వినిపించిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తరువాత తెగ హడావుడి చేశారు. తాను కేవలం ప్రజా సేవ చేయడానికి వచ్చానని ఎన్నికల సమయంలో ధీమాగా చెప్పిన బండ్ల గణేశ్ ఎన్నికల తర్వాత అసలు మీడియాకు ముఖం చాటేశారు. కాగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలువక పోతే ఏకంగా పీకే కోసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఎన్నికలైపోగానే ప్యాకప్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే 6 నెలలు కూడా గడవకముందే కాంగ్రెస్ పార్టీతో పాటు ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేశారు. తాజాగా ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్ తాను రాజకీయాల నుంచి తప్పుకోవడంపై వివరణ ఇచ్చారు.

తాను రాజకీయాలకు పనికిరానని అర్థమైందరని. ఇప్పుడున్న పరిస్థితిల్లో రాజకీయాలు చేయలేనని భయమేసిందని అన్నారు. కాగా అసలు నాకు అనవసరం అనిపించింది. అయితే నిజంగానే రాజకీయాల్లోకి తొందరపడి నిర్ణయం తీసుకున్నానేమో అనిపించిందన్నారు. తన మైండ్ సెట్ రాజకీయాలకు పనికిరాదని తనకు అందరితోనూ సంబంధాలు అవసరమని గణేశ్ తెలిపారు. తన రాజకీయం కానీ కంటిన్యూ అయితే మన అడ్రస్ గల్లంతు అయిపోతుందని గ్రహించి రాజకీయాల నుంచి తప్పుకున్నా అని బండ్ల గణేశ్ వివరణ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తాను కేసీఆర్, కేటీఆర్ పై ఏదేదో మాట్లాడానని కానీ వాళ్లు మాత్రం ఏ ఒక్కరోజు కూడా పల్లేతు మాట కూడా నన్ను అనలేదని గుర్తుచేశారు. అబద్ధాలు చెబుతూ రాజకీయాల్లో యాక్ట్ చేసే బదులు అదేదో సినిమాల్లోనే చేసుకుంటే హ్యాపీగా బతకొచ్చు అని అన్నారు. ఎన్నికల తరువాత కూడా వాళ్ల ఇంటికి వెళ్లానని తన కుమారుడిని కేటీఆర్ గారి అబ్బాయి వారి ఇంటికి తీసుకెళ్లాడని చెప్పారు కాగా అలాంటి వాళ్లపై ఇష్టం వచ్చినట్లు తిట్టాను అని అలాంటి మంచి వ్యక్తులపై తప్పుగా మాట్లాడినందుకు తప్పు చేశానని ఫీలైనట్టు చెప్పారు. ఇక ఫైనాల్ గా తాను తాత్కాలికంగానే కాదు శాశ్వతంగానే రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నట్టు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories