రష్యా ఎన్నికల్లో పుతిన్ కే పట్టం

రష్యా ఎన్నికల్లో పుతిన్ కే పట్టం
x
Highlights

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్.. ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో రష్యా జనం.. పుతిన్ కే పట్టం కట్టారు. 73.9 శాతం ఓట్లతో...

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్.. ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో రష్యా జనం.. పుతిన్ కే పట్టం కట్టారు. 73.9 శాతం ఓట్లతో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గత రెండు దశాబ్దాలుగా రష్యాను ఏలుతున్న పుతిన్‌కు అక్కడి ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారు. బరిలో ఏడుగురు అభ్యర్థులుండగా.. ప్రధాన ప్రత్యర్థి అయిన అలెక్సీ నావల్నీ.. న్యాయపరమైన చిక్కులతో పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో పుతిన్ గెలుపు.. లాంఛనమే అని తేలిపోయింది.

రష్యాలో ఏకంగా 11 టైమ్ జోన్లు ఉండటంతో.. శనివారం అర్ధరాత్రి మొదలైన ఎన్నికలు.. ఆదివారం అర్ధరాత్రి వరకు సాగాయి. మొత్తం 10 కోట్ల 7 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెజారిటీ ఓట్లు.. పుతిన్ కే పడినట్లు అక్కడి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 2000 నుంచి 2008 వరకు రెండు సార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన పుతిన్.. ఆ తర్వాత నాలుగేళ్లు ప్రధానిగా పనిచేశారు. 2012 లో మూడోసారి అధ్యక్షుడైన తర్వాత.. ప్రస్తుతం మరోసారి అదే పదవికి ఎన్నికయ్యారు. పుతిన్ పై రష్యా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా.. అతన్ని మించిన నాయకుడు అక్కడెవరూ లేకపోవడంతో.. పుతిన్ నే నమ్మాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories