మళ్లీ బాలీవుడ్ మీద కన్నేసిన క్రిష్

మళ్లీ బాలీవుడ్ మీద కన్నేసిన క్రిష్
x
Highlights

తెలుగులో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న క్రిష్ ఈ మధ్యనే హిందీలో 'మణికర్ణిక' సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా దర్శకత్వం విషయంలో...

తెలుగులో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న క్రిష్ ఈ మధ్యనే హిందీలో 'మణికర్ణిక' సినిమాకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా దర్శకత్వం విషయంలో బోలెడు వివాదాల్లో చిక్కుకున్నాడు క్రిష్. దర్శకత్వం క్రెడిట్స్ విషయంలో క్రిష్, కంగనా లకు జరిగిన గొడవ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్రిష్ ఇంకెప్పుడూ కంగనా తో సినిమా చేయను అని డైరెక్ట్ గానే చెప్పాడు. అయితే తాజాగా క్రిష్ బాలీవుడ్ లో తన సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ తో రెండు డిజాస్టర్ల ను అందుకున్న క్రీష్ తాజాగా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్దం చేశాడట. కథ రెడీ అవగానే దానిని ఒక బాలీవుడ్ స్టార్ కు వినిపించాడట. ఆ బాలీవుడ్ స్టార్ ఎవరో కాదు ఈ మధ్య '2.ఓ' సినిమాలో విలన్ గా కనిపించిన అక్షయ్ కుమార్. అక్షయ్ కి కూడా కథ నచ్చిందని తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరి ఈ సినిమాతో అయినా క్రిష్ హిట్ అందుకుని బాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకుంటాడో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories