సమంత కామెంట్స్ పై దిల్ రాజు క్లారిటీ

సమంత కామెంట్స్ పై దిల్ రాజు క్లారిటీ
x
Highlights

పిరియడ్ ప్రేమకథగా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన '96' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈ సినిమా...

పిరియడ్ ప్రేమకథగా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన '96' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈ సినిమా తమిళ సినిమాలలో క్లాసిక్ గా నిలిచిపోనుంది. ఇప్పుడు అదే చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా శర్వానంద్ మరియు సమంత నటించనున్నారు. అయితే ఈ సినిమా రీమేక్ గురించి సంప్రదించగా అలాంటి అద్భుతమైన సినిమాను రీమేక్ చేయకపోవడమే మంచిదని సమంత అన్నట్లు తెలిసిన విషయమే.

అలా అన్న సమంత ఇప్పుడు అదే సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత కామెంట్స్ పై మాట్లాడుతూ దిల్ రాజు ఈ మధ్యనే రియాక్ట్ అయ్యారు. రీమేక్ లో ఎవరెవరు నటిస్తున్నారు ఎవరు నిర్మించనున్నారు అనేవి తెలియక సమంత అలా మాట్లాడింది అని దిల్ రాజు అన్నారు. ఒకవేళ ముందే తెలిసి ఉంటే ఆ మాట అనేవారు కాదని దిల్ రాజు స్పష్టం చేశారు. ఇక తమిళ సినిమాను కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్ల నుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories