సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పాంచ్ పటాకా

Submitted by admin on Wed, 12/13/2017 - 12:28

పోర్చుగీసు కమ్ రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో....ప్రపంచ అత్యుత్తమ సాకర్ ప్లేయర్ అవార్డును ఐదోసారి గెలుచుకొన్నాడు. సమీప ప్రత్యర్థులు లయనల్ మెస్సీ, నైమార్ జూనియర్ లను అధిగమించి..మరీ రొనాల్డో బాలోన్ డీ అవార్డు అందుకొన్నాడు. పారిస్ నగరంలోని ఈఫిల్ టవర్ వేదికగా జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో క్రిస్టియానో రొనాల్డో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గతంలో...2008, 2013, 1014, 2016 సంవత్సరాలలో ఇదే పురస్కారం అందుకొన్న రొనాల్డో...చాంపియన్స్ లీగ్ చరిత్రలోనే అత్యధికంగా 115 గోల్స్ సాధించి తనకు తానేసాటిగా నిలిచాడు. లయనల్ మెస్సీ పేరుతో ఉన్న ఐదు ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్ అవార్డుల రికార్డును క్రిస్టియానో రొనాల్డో సమం చేయగలిగాడు.

English Title
ronaldo-worlds-fifth-best-player-award

MORE FROM AUTHOR

RELATED ARTICLES