డేంజర్ యాక్సిడెంట్స్

x
Highlights

వాహనాల రద్దీ పెరగడంతో రోడ్డుపైకి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పాదాచారులు రోడ్డు దాటాలంటే హడలిపోతున్నారు. వాహనాలు మెరుపు వేగంతో దూసుకురావడంతో...

వాహనాల రద్దీ పెరగడంతో రోడ్డుపైకి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. పాదాచారులు రోడ్డు దాటాలంటే హడలిపోతున్నారు. వాహనాలు మెరుపు వేగంతో దూసుకురావడంతో రెప్పపాటులో ఘోర ప్రమాదాలు జరిగిపోతున్నాయి. తరచుగా జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలతో కొంత మంది ప్రాణాలు కోల్పోతే చాలామంది తీవ్ర గాయాపడి ఇబ్బందిపడుతున్నారు.

ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని రకాల భద్రతా చర్యలను చేపడుతున్నా రోజురోజుకి రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం, కనీస ట్రాఫిక్ రూల్స్ ను పాటించకపోవడంతో ఏటా తెలుగు రాష్ట్రాల్లోనే వందలాది మంది విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా ప్రచారాలు నిర్వహించినా వాహనదారులు మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది.

ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మైనర్ డ్రైవింగ్ కూడా ఓ ప్రదాన కారణం. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని పిల్లలు, యువకులకు వాహనాలను నడిపేస్తున్నారు. ప్రదాన కూడళ్లతో పాటు జాతీయ రహదారులపైకి దూసుకొచ్చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పై ఏమాత్రం అవగాహన లేకుండా, రోడ్లుపై రయ్ మంటూ దూసుకొస్తున్న యువత పలు యాక్సిడెంట్స్ చేస్తున్నారు.

మోటార్‌ వాహన చట్టం ప్రకారం మైనర్లకు వాహనాలు ఇవ్వద్దంటూ ప్రభుత్వం, అధికారులు ఎంత చెబుతున్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. పిల్లలు అడుగుతున్నారని బైక్స్, కారులు ఇచ్చి రోడ్డుపైకి పంపుతున్నారు. ఫలితంగా విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. తమ పిల్లులు అడిగారని ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్, హై ఎండ్ కార్లు కొని ఇచ్చేస్తున్నారు పేరెంట్స్. అంతేగానీ, పూర్తిగా డ్రైవింగ్ రాకుండా రోడ్డుపైకి పంపితే జరిగే ఘోరాల గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. పిల్లలు సరాదా పడ్డారని వాహనాలను ఇచ్చేస్తున్నారు పేరెంట్స్ ముంచుకొచ్చే ప్రమాదాన్ని ఊహించడం లేదు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళ్తున్న స్టూడెంట్స్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బీబీనగర్ మండలం కొండమడుగుకు సమీపంలో అరోరా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తున్నారు. వీళ్లు రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

అసలే ట్రిపుల్ రైడింగ్. బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కనీసం జాగ్రత్తగా వెళ్లాలని కూడా ప్రయత్నించలేదు. అటువైపు కారు డ్రైవర్ కూడా వీరి రాకను గమనించి ఆగే ప్రయత్నమూ చేయలేదు. దీంతో జరగకూడని నష్టమే జరిగింది. స్పాట్‌లోనే ఒకరు మృతి చెందగా మిగిలిన ఇద్దరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు.

రద్దీగా ఉండే రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అలాంటి సమయంలో ఏ మాత్రం నిర్లక్ష‌్యం వహించొద్దు. దూసుకొచ్చే వాహనాలను పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం అంటే ప్రాణాలతో చెలగటం ఆడటమే. గత నెలలో హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌పై జరిగిన ప్రమాదం ఓ వృద్ధుడి ప్రాణాల మీదికి తెచ్చింది.

జీబ్రా క్రాసింగ్‌పై రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని ఓ బైక్‌ ఢీ కొట్టింది. ఇద్దరు వృద్ధులు జీబ్రా క్రాసింగ్‌పై రోడ్డు దాటుతున్నారు. అయితే సిటీ బస్సు, ఆ పక్కనే మరో బైక్‌ వేగంగా దూసుకొస్తున్న క్రమంలో మొదటి వ్యక్తి, రోడ్డును సేఫ్‌గానే దాటాడు. కానీ రెండో వ్యక్తి వెంకటేశ్వర్రావ్‌ మాత్రం ప్రమాదానికి గురయ్యాడు. మొదట అతను బస్‌ను చూసి, దాన్ని దాటాడు. అయితే ఆ పక్కనే వస్తున్న బైక్‌ను మాత్రం అతడు గమనించలేదు. దీంతో స్పీడ్‌గా వస్తున్న బైక్‌ ఒక్కసారిగా అతన్ని ఢీ కొట్టింది. ఆ సమయంలో వెంకటేశ్వర్రావ్‌ ఒక్కసారిగా అదే బైక్‌ హ్యాండిల్‌పై కూలబడ్డాడు. స్పీడ్ గా వచ్చిన బైక్‌‌ అతన్ని సుమారు 300 మీటర్ల వరకు ఊడ్చుకెళ్లింది. సమయస్పూర్తితో బైక్‌ను ఆపడంతో ప్రాణాపాయం తప్పింది. కనీస జాగ్రత్తలు పాటించకుండా రోడ్డు దాటితే.. ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అని చెప్పే ఈ దృశ్యాలు.. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని హెచ్చరిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories