అభిమానులను లైవ్‌లో ఫిదా చేసిన ప్రియ

Submitted by arun on Sat, 02/17/2018 - 15:01
Priya Prakash Varrier

కన్నుకొట్టి యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్.. ఓవర్‌నైట్‌లో ఫుల్ స్టార్ డమ్ సంపాదించేసింది. యూత్ నుంచి ఒకప్పటి హీరోల వరకూ అందరికీ ఆరాధ్య దేవత అయింది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు కూడా ప్రియా నువ్వు నా టైమ్‌లో ఎందుకు రాలేదంటూ బాధను వ్యక్తం చేశారు. తాజాగా అమ్మడు లైవ్‌లో మరోసారి ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రంలో తనతో పాటు నటించిన రోషన్‌కు గన్ ఎక్కుపెట్టడమే కాకుండా.. ప్రేక్షకుల హృదయాలను కూడా పేల్చేసింది.

‘ఒరు అదార్‌ లవ్’‌ టీజర్‌లో ప్రియ ముద్దును గన్‌లో లోడ్ చేసి ప్రేమికుడికి గురి పెట్టి పేల్చేసిన సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు ఇదే సీన్‌ను ప్రియ లైవ్‌లో చేసింది. స్టేజ్‌ మీద తెరపై టీజర్‌ వస్తుండగా.. ప్రియ, రోషన్‌ అదే సన్నివేశాన్ని ప్రేక్షకుల ముందు చేశారు. అనంతరం ఆమె ముద్దును గన్‌లో మరోసారి లోడ్‌ చేసి ప్రేక్షకులకు గురి పెట్టి పేల్చారు. ఇంకేముందు ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా ఈలలు, అరుపులతో హోరెత్తిపోయింది. లైవ్‌లో ఆమె చేసిన అభినయానికి అందరూ మరోసారి ఫిదా అయిపోయారు.

Image removed.

Image removed.

English Title
Rishi Kapoor predicts ‘huge stardom’ for Priya Prakash Varrier

MORE FROM AUTHOR

RELATED ARTICLES