శ్రీలంకలో మరో బాంబు.. పోలీసుల నిర్వీర్యం

శ్రీలంకలో మరో బాంబు.. పోలీసుల నిర్వీర్యం
x
Highlights

శ్రీలంక బాంబు పేలుళ్ళ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు13 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 24...

శ్రీలంక బాంబు పేలుళ్ళ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు13 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 24 మందిని విచారిస్తున్నారు. మరోవైపు కొలంబో ఎయిర్‌పోర్టు దగ్గర పెను ప్రమాదం తప్పింది. కొలంబో ఎయిర్‌పోర్టు దగ్గర్లో పేలడానికి సిద్ధంగా ఉన్న పైప్ బాంబును గుర్తించి నిర్వీర్యం చేయడంతో భారీ విధ్వంసం తప్పింది. ఎయిర్‌పోర్టులోని ప్రధాన టెర్మినల్‌కు వెళ్లే మార్గంలో బాంబును అమర్చినట్లు అధికారుల తెలిపారు. వరుస పేలుళ్ళ తర్వాత కొలంబోలో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు ముమ్మరం చేసింది.

నిన్న శ్రీలంకలో జరిగిన సీరియల్ పేలుళ్ళలో రెండింటిని అధికారులు ఆత్మాహుతి దాడులుగా భావిస్తున్నారు. అనుమానితుల్ని పేలుళ్ళకు పాల్పడిన ప్రాంతాల్లోనే అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఒకే తీవ్రవాద ముఠాకు చెందిన వారని సమాచారం. మూడు నెలల ముందుగానే ముష్కరులు పేలుళ్ళకు పథకం పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. సౌత్‌ కొలంబో శివార్లలోని పనదురాలో తీవ్రవాదులు నివాసమున్న భవనాన్ని శ్రీలంక పోలీసులు గుర్తించారు.

శ్రీలంక పేలుళ్ళ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శ్రీలంక బాంబు పేలుళ్ళ ఘటనలో మృతుల సంఖ్య 290కి చేరగా వీరిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. మరణించిన భారతీయుల పేర్లు లక్ష్మి, రమేష్, నారాయణ చంద్రశేఖర్, కేజీ హనుమంతప్ప, ఎం రంగప్ప అని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. పేలుళ్ళ ఘటనలో గాయపడిన వారి సంఖ్య 500కి చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories