కేటీఆర్‌కు రేవంత్‌‌ 10కె రన్ సవాల్

Submitted by arun on Mon, 07/23/2018 - 17:49
rk

పొలిటికల్ ఫిట్‌నెస్‌లో తనతో పోటీ పడే వారెవరూ తెలంగాణలోనే ఎవరూ లేరని కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌ చేసిన రేవంత్‌ రాజకీయాల్లోనే కాదు ఏ ఆటలో కూడా కేటీఆర్‌ తనతో పోటీ పడలేరని తెలిపారు. కేటీఆర్‌వి అన్నీ పిట్‌ నెస్‌ లేని ఆటలే అని ఎద్దేవా చేశారు. చేతనైతే కేటీఆర్ తనతో 10 కే రన్నింగ్ కు రావాలన్నారు. అప్పడు ఉద్యమ ముసుగులో చిల్లర రాజకీయాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు అధికారం ముసుగులో పోలీసులతో చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు దేశంలో రాహుల్‌ గ్రాఫ్‌ క్రమ క్రమంగా పెరుగుతోందని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. మోడీకి ధీటైన నాయకుడిగా రాహుల్‌ కనిపిస్తున్నారని అన్నారు. అవిశ్వాస తీర్మాణంపై చర్చలో తన ప్రసంగంతో రాహుల్‌ ప్రజలకు మరింత చేరువయ్యారని మోడీని ఆలింగనం చేసుకోవడం ద్వారా తనను ద్వేషిస్తున్నవారికి మంచి సందేశాన్ని ఇచ్చారని రేవంత్‌ చెప్పారు. 

English Title
revanth reddy chit chat with media

MORE FROM AUTHOR

RELATED ARTICLES