కేటీఆర్ కు జ్వరం..రేవంత్ బర్త్ డే ట్వీట్ వైరల్

Submitted by arun on Tue, 07/24/2018 - 17:08
Revanth Reddy

42వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోన్న మంత్రి కేటీఆర్‌‌‌కు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తనకు బర్త్‌డే విషెస్‌ చెబుతోన్న నేతలకు, అభిమానులకు కేటీఆర్‌ పేరుపేరునా ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు. మీరు నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానులకు, మిమ్మల్ని అందరినీ కలిసి పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పాలని ఉందన్నారు. కానీ ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్నందున ఇంటికే పరిమితమైనట్లు తెలిపారు. అందరికీ మరోసారి ధన్యవాదాలు అంటూ ట్వీట్‌‌ ముగించారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ కు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. శుభాకాంక్షలు తెలిపినట్లే తెలిపి కేటీఆర్‌కు ఫిట్‌నెస్  సవాల్ కూడా విసిరాడు. ‘కేటీఆర్.. ట్విట్టర్‌లో ఆడటం కాదు.. మైదానంలో ఆడాలి’ అని తాను మైదానంలో పుట్‌బాల్ ఆడుతున్న ఫోటోను షేర్ చేశారు. రేవంత్ రెడ్డి బర్త్ డే ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

English Title
Revanth Reddy Challenges to KTR

MORE FROM AUTHOR

RELATED ARTICLES