ప్రత్యేక హోదా అంటే ఏమిటో నిర్వచించండి?

ప్రత్యేక హోదా అంటే ఏమిటో నిర్వచించండి?
x
Highlights

తెలంగాణ ప్రజలు బీజేపీని క్షమించరని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వినోద్ ఏపీలో కలిపిన ఏడు మండలాల గురించి...

తెలంగాణ ప్రజలు బీజేపీని క్షమించరని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వినోద్ ఏపీలో కలిపిన ఏడు మండలాల గురించి ప్రస్తావించారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిందని విమర్శించారు. ఏడు మండలాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని చంద్రబాబు చెప్పారనీ ఆయన ఒత్తిడి వల్లే ప్రధాని మోడీ స్వయంగా చొరవ తీసుకుని ఆ ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో కలిపిన 7 పోలవరం ముంపు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ఇందుకోసం విభజన చట్టాన్ని సవరించేలా బిల్లు పెట్టాలని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో విలీనం చసిన అంశాన్ని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ప్రస్తావించగానే టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు టీడీపీ - టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ 7 మండలాలు గతంతో ఏపీలోనే ఉండేవని టీడీపీ సభ్యులు అంటే అవి హైదరాబాద్ స్టేట్‌లో ఉండేవని వినోద్ వాదించారు. మోడీ అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్న తొలి నిర్ణయమే తెలంగాణకు వ్యతిరేకంగా ఉందన్న వినోద్ ఆర్డినెన్స్ తెచ్చిమరీ 7 మండలాలను ఏపీలో విలీనం చేశారని గుర్తు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కావాలనే హైకోర్టు నిర్మించుకోవడం లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అవిశ్వాప తీర్మానం చర్చ సందర్భంగా ఆరోపించారు. అమరావతిలో రికార్డు సమయంలో సచివాలయం, అసెంబ్లీ నిర్మించున్న సీఎం చంద్రబాబు హైకోర్టు నిర్మాణం కోసం మాత్రం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. హైకోర్టు విభజన జరగకపోవడంతో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని వినోద్ అన్నారు. వెంటనే హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా అంటే ఏమిటో నిర్వచించాలని ప్రత్యేక హోదా చర్చలో ఎంపీ వినోద్ కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారనీ..హోదా ఇస్తే పన్ను మినహాయింపులు కూడా ఇస్తారా అని ప్రశ్నించారు. ఏపీకి పన్ను వినహాయింపులు ఇస్తే తెలంగాణకూ ఇస్తారా లేదా? అని రాహుల్‌ను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అనే అంశం చట్టంలో ఎక్కడా లేదన్న వినోద్..ప్రత్యేక హోదా అంటే ఏమిటో కాంగ్రెస్, బీజేపీ స్పష్టత ఇవ్వాలని...డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories