కేంద్ర బడ్జెట్‌లో వాహనదారులకు గట్టి ఎదురుదెబ్బ

కేంద్ర బడ్జెట్‌లో వాహనదారులకు గట్టి ఎదురుదెబ్బ
x
Highlights

కేంద్ర బడ్జెట్‌లో వాహనదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెట్రోల్‌ ధరలు ఇప్పటికే పరుగులు పెడుతుండగా బడ్జెట్‌లో ఇంధన ధరలపై సెస్‌ విధించడంతో ఇవి మరింత...

కేంద్ర బడ్జెట్‌లో వాహనదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెట్రోల్‌ ధరలు ఇప్పటికే పరుగులు పెడుతుండగా బడ్జెట్‌లో ఇంధన ధరలపై సెస్‌ విధించడంతో ఇవి మరింత భారం కానున్నాయి. ప్రతి లీటర్‌పై ఒక రూపాయి అదనంగా బడ్జెట్‌లో సెస్‌ విధించారు. దీంతో పెట్రోల్‌ ధర 2 రూపాయల 50 పైసలు, డీజిల్ 2 రూపాయల 30 పైసలు పెరగనుంది.

వాహనదారులపై మరింత భారం పడనుంది. ఇంధన ధరలపై సుంకాలు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై ఒక రూపాయి చొప్పున సెస్‌ పెంచుతున్నట్లు తెలిపారు. దీంతో ఇంధన ధరలు పెరగనున్నాయి.

అదనపు సెస్‌తో పెట్రో ధరలు సామాన్యుడికి సెగలు పుట్టించనున్నాయి. పెట్రో ధరలు పెరగడంతో సరుకు రవాణా ఛార్జీలు భారమై నిత్యావసరాల ధరలూ ఎగబాకే అవకాశం ఉంది. దీంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పెట్రో సెస్‌ ద్వారా కేంద్రానికి రోజూ దాదాపు 200 కోట్ల రూపాయల రాబడి సమకూరుతుందని అంచనా. అయితే సామాన్యుడికి మాత్రం మరింత భారం పడనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories