కోమటిరెడ్డి, సంపత్‌లకు హైకోర్టులో ఊరట

Submitted by arun on Mon, 03/19/2018 - 17:11
komatireddy venkat reddysampath kumar

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసన సభ్యత్వాల రద్దు కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఆరు వారాలపాటు ఎన్నికల ప్రక్రియ చేపట్టవద్దంటూ ఈసీని ఆదేశించింది. శాసన సభ్యత్వాల రద్దు కేసులో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌‌‌లకు స్వల్ప ఊరట లభించింది. శాసన సభ్యత్వాల రద్దు‌ను సవాలు చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌లు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. శాసన సభ్యత్వాలు రద్దుచేసిన రెండు స్థానాల్లో ఆరు వారాలపాటు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని, అలాగే ఎలాంటి ఎన్నికల ప్రక్రియ చేపట్టొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసన సభ్యత్వాల రద్దు వ్యవహారంలో వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అదేవిధంగా ఆరోజు అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన ఒరిజినల్‌ వీడియో ఫుటేజ్‌‌ను ఈనెల 22లోగా సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని సూచించింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసన సభ్యత్వాల రద్దు వ్యవహారంలో తుది తీర్పు ఇచ్చేవరకూ తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. అనంతరం కేసు విచారణను మార్చి 22కి వాయిదా వేసింది.
 

English Title
relief telangana congress mlas highcourt

MORE FROM AUTHOR

RELATED ARTICLES