అమ‌రావ‌తి అభివృద్ధిని చూసి ఆశ్చ‌ర్య‌పోయిన ముఖేష్ అంబానీ

Submitted by lakshman on Wed, 02/14/2018 - 03:20
Reliance Mukesh Ambani to meet CM Chandrababu

చంద్రబాబు చొర‌వ‌తో దేశంలోనే అగ్రగాములుగా వున్న పలు కార్పొరేట్ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ పరిశ్రమలను విస్తరించడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక దిగ్గజం ముఖేష్  అంబానీ ఆంధ్రప్రదేశ్‌లో తన పరిశ్రమలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబుతో సూత్రప్రాయంగా చర్చలు కూడా జరిగినట్టు సమాచారం.
సీఎం చంద్ర‌బాబు రాష్ట్రం కోసం అహ‌ర్నిశ‌లు కృషిచేస్తున్నారు. అభివృద్ధే ప‌ర‌మావ‌ధిగా పనిచేస్తూ నేటి కాలంతో పోటీ ప‌డుతున్నారు. వ‌య‌సు మీద‌ప‌డుతున్నా అవేం లెక్క చేయ‌కుండా రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురావాల‌నే ఉద్దేశంతో  విదేశాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.  ఈ టూర్ల‌పై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నా ప‌ట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.
ఈ నేప‌థ్యంలో ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌పంచ పార‌శ్రామిక దిగ్గ‌జం రిల‌యన్స్ అధినేత ముఖేష్  అంబానీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శ్నంస‌ల వ‌ర్షం కురిపించారు. స‌చివాల‌యంలో రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ కేంద్రాన్ని సంద‌ర్శించిన ముఖేష్  అంబానీ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. 
ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన అంబానీ ఇదివ‌రకే చంద్ర‌బాబు రాష్ట్రం గురించి వివ‌రించినా ప‌ట్టించుకోలేద‌ని , కానీ  రియల్‌టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీ)  చూసిన త‌రువాత ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు చెప్పారు.  మాకంటే మీరే ఎంతో ముందున్నారు. మీతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం.
కలలు అందరూ కంటారు. వాటిని సాకారం చేసుకునేవారు చాలా తక్కువ మందిమాత్రమే ఉంటార‌ని ముఖేశ్ అంబానీ చంద్ర‌బాబుని ఆకాశానికెత్తారు.  ఆర్టీజీని అన్ని రాష్ట్రాలకు చూపించాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఆర్టీజీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. నేడు డాటా అనేది ఎంతో కీలకమైన అంశమని చెప్పుకొచ్చారు.  

 

English Title
Reliance Mukesh Ambani to meet CM Chandrababu

MORE FROM AUTHOR

RELATED ARTICLES