జియో బంపర్ ఆఫర్...రూ.499కే ‘జియోఫై’ రూటర్

Submitted by arun on Tue, 07/03/2018 - 16:40
JioFi Device

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన జియోఫై పోర్టబుల్ 4జీ రూటర్‌ను కేవలం రూ.499కే పొందేలా వీలు కల్పించింది. ఇందుకు గాను కస్టమర్లు ముందుగా రూ.999కి జియోఫై రూటర్‌ను కొనుగోలు చేయాలి.
4జీ రూటర్ ‘జియోఫై’ పై రూ.500 క్యాష్ బ్యాక్ ప్రకటించింది. నిజానికి దీని అసలు ధర రూ.1999 కాగా, గతేడాది సెప్టెంబరులో ధరను రూ.999కి తగ్గించింది. ఇప్పుడీ ధరపై రూ.500 క్యాష్ బ్యాక్ ప్రకటించడంతో రూ.499కే జియోఫై డాంగిల్‌ను సొంతం చేసుకునే అద్భుత అవకాశం లభించింది. ఇప్పటికే జియోఫై రూటర్‌ను ఉపయోగిస్తున్నవారు ఈ ఆఫర్‌కు అనర్హులు. కొత్త వినియోగదారులకు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుందని జియో పేర్కొంది. ఆఫర్ నేటి నుంచే అమల్లోకి వచ్చింది. అయితే, ఎప్పటి వరకు ఇది అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. జియో స్టోర్లు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా ‘జియోఫై’ని కొనుగోలు చేసుకోవచ్చు.

జియోఫై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ యూజర్లు పొందడం కోసం, తొలుత యూజర్లు ఆ డివైజ్‌ను కొనుగోలు చేయాలి. దానిలో కొత్త పోస్టుపెయిడ్‌ సిమ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. కచ్చితంగా కనీసం 199 రూపాయల విలువైన పోస్టుపెయిడ్‌ ప్లాన్‌తో యూజర్లు రీఛార్జ్‌ చేయించుకోవాలి. ఇలా 12 నెలల పాటు రీఛార్జ్‌ చేయించుకుంటూనే ఉండాలి. 12 నెలల తర్వాత, తర్వాత బిల్‌ సైకిళ్లలో ప్రకటించిన 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను రిలయన్స్‌జియో అందించనుంది. జియో తన పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ రూ.199 కింద 25 జీబీ డేటాను, ఉచిత వాయిస్‌ కాల్స్‌ను, అపరిమిత ఎస్‌ఎంఎస్‌లను, జియో యాప్స్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందనున్నారు. 
 

English Title
Reliance Jio’s new offer: Rs 500 cashback on JioFi device

MORE FROM AUTHOR

RELATED ARTICLES