తెలంగాణలో అకాలవర్ష బీభత్సం.. ఐదుగురి మృతి

తెలంగాణలో అకాలవర్ష బీభత్సం.. ఐదుగురి మృతి
x
Highlights

తెలంగాణలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో...

తెలంగాణలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో రైతులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈదురు గాలులతో ప్రారంభమై వడగండ్ల వానగా మారింది. ఈదురు గాలులతో కోతకు వచ్చిన వరిపైరు నేల వాలింది. వడగండ్ల వానతో ధాన్యం మట్టి పాలైంది. పలు చోట్లు కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు తీసుకు వచ్చిన దాన్యం తడిసిపోయింది.

పిడుగు పాటుకు నల్లగొండ జిల్లాలో ఇద్దరు, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మరణించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాలలో గోడ కూలి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలుచోట్ల పిడుగు పాటుకు పశువులు మృత్యువాతపడ్డాయి. వానకు తోడు అతి వేగంతో గాలి వీయడంతో పలు చోట్ల ఇంటిపై కప్పులు కొట్టుకోపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇండ్లల్లో విద్యుత్‌ పరికరాలు కాలిపోయాయి.

బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో హిందూ మహాసముద్రాన్ని అనుకుని ఉన్న ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మరో నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన ర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు కురువొచ్చని పేర్కొన్నది. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోమెరిన్ ప్రాంతం వరకు ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తువద్ద ఉపరితల ద్రోణి, హిందూమహాసముద్రం, దానిని అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.













Show Full Article
Print Article
Next Story
More Stories