రికార్డింగ్ డ్యాన్స్‌లను అడ్డుకున్నందుకు పోలీసులపై దాడి

Submitted by arun on Thu, 07/26/2018 - 14:48

నెల్లూరు జిల్లా కావలి కొత్తసత్రంలో పోలీసులపై మత్స్యకారులు దాడికి దిగారు. రికార్డింగ్‌ డ్యాన్సులను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై మూకుమ్మడిగా మత్స్యకారులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఎస్సై పుల్లారావు, ఇద్దరు కానిస్టేబుల్స్‌ గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన పోలీసులు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం కొత్తసత్రం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. సమాచారం అందుకున్న కావలి రూరల్ పోలీసులు రంగంలోకి దిగారు. కానిస్టేబుళ్లు నాగరాజు, ప్రేమ్‌కుమార్‌లతో కలసి ఎస్సై పుల్లారావు కొత్తసత్రం గ్రామానికి వెళ్లారు. అది మత్స్యకార గ్రామం. రికార్డింగ్ డ్యాన్సులను వెంటనే ఆపేయాలని ఎస్సై పుల్లారావు అక్కడ ఉన్నవారిని ఆదేశించారు. వారు వినకపోవడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై వారు దాడికి పాల్పడ్డారు. 

ఈ దాడిలో సుమారు 300 మంది మత్స్యకారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎస్సై పుల్లారావును విచక్షణారహితంగా కొట్టిన మత్స్యకారులు ఆయన చనిపోయాడనని భావించి సముద్రం ఒడ్డున పడేసినట్లు సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుళ్లు.. ఎస్సై పుల్లారావును హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వీరంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దాడికి సంబంధించి ఇంకా ఎవరిపైనా కేసులు నమోదు కాలేదు. ఎస్సైతో సహా సిబ్బంది కోలుకున్నాక గ్రామానికి వెళ్లి నిందితులను గుర్తించే అవకాశముంది. 

English Title
Recording Dance: Villagers Attack Police

MORE FROM AUTHOR

RELATED ARTICLES