రామ్‌చరణ్‌ కొత్త చిత్రం..ఫస్ట్‌లుక్‌ రేపే!

రామ్‌చరణ్‌ కొత్త చిత్రం..ఫస్ట్‌లుక్‌ రేపే!
x
Highlights

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ కూడా ఖరారు కాలేదు....

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ కూడా ఖరారు కాలేదు. 'స్టేట్‌ రౌడీ' 'వినయ విధేయ రామ' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్రవర్గాలు ట్విటర్ ద్వారా వెల్లడించాయి. ఈనెల6న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృం‎దం ప్రకటించారు.

ఈసినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అడ్వాణీ నటించారు. ఇటీవల సినిమా చిత్రీకరణ పూర్తయింది. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో నటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories